Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Rajyasabha election notification end of April

By   /  April 24, 2016  /  Comments Off on Rajyasabha election notification end of April

    Print       Email

abn`పెద్ద‌ల స‌భ‌`కు ఆ ముగ్గురు పోటీ?

 

InCorpTaxAct
Suvidha

 

 

రాజ్య‌స‌భ ఎన్నిక‌కు ఏప్రిల్ చివ‌రిలో నోటిఫికేష‌న్ వ‌స్తున్న త‌రుణంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ త‌రుపు నుంచి రాజ్య‌స‌భ సీటు ఆసిస్తున్నారు. త‌మ సేవ‌ల‌ను గుర్తించి త‌మ‌కు ఇవ్వాలంటే త‌మ‌కు ఇవ్వాలంటూ పోటీప‌డుతున్నారు. అలా పోటీ ప‌డేవారిలో ప‌త్రికాధిప‌తులు, టీవీ ఛాన‌ల్స్ అధిప‌తులు ఉన్నారు. అయితే ఇందులో ఇద్ద‌రు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కాగా.. మ‌రొక‌రు క్ష‌త్రియ వ‌ర్గానికి సంబంధించిన వారుఉన్నారు. సీటు ఆశిస్తున్న‌వారిలో ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఛాన‌ల్ అధిప‌తి వేమూరి రాధాకృష్ణ ముందు వ‌రుస‌లోఉన్నారు.  వేమూరి రాధాకృష్ణ చాలా ఏళ్ల నుంచి బాబుకు సన్నిహితం గా ఉంటున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అసెంబ్లీ లైవ్ టెలికాస్టు, సమాచారశాఖకు అధికారికంగా లైవ్ టెలికాస్టు హక్కులు సాధించుకు న్నారు.  పార్టీకి తాను చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని తనకు టికెట్ ఇవ్వాలని ఆయన బాబును కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఇక‌పోతే టీవీ9 అధిప‌తి శ్రీ‌నిరాజు, టీవీ 5 య‌జ‌మాని బీఆర్ నాయుడు కూడా చంద్ర‌బాబునాయుడును  రాజ్య‌స‌భ సీట్లు అడుగుతున్న‌ట్లు స‌మాచారం. తనకు దేశవ్యాప్తంగా చానెల్స్ ఉన్నందున, తనకు అవకాశం ఇస్తే పార్టీ  విస్తృతం అవుతుంద‌ని,  పార్టీకీ ప్రయోజనం ఉంటుందని శ్రీనిరాజు చెబుతున్నారని, అదేదారిలో నాయుడు కూడా ఉన్నారని పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీఆర్ నాయుడు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ప్రయత్నించారన్న వార్తలు కూడా వ‌చ్చాయి. చంద్ర‌బాబునాయుడు వీళ్ల‌ల్లో ఎవ‌రికి సీటు ఇస్తారో.. ఎవ‌రికి ఎలా స‌ముదాయిస్తారో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →