మోగిన రాజ్యసభ ఎన్నికలక నగారా
రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు పదవీకాలం జూన్ నెలాఖరుతో ముగుస్తుండడంతో ఆ స్థానాలను భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు రాజ్యసభ ఎన్నికలక షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది. కాగా తెలంగాణలో రెండు స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలోని మీడియా లాంజ్‌లో రాజ్యసభ నామినేషన్ల దరఖాస్తులు విక్రయించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నామినేషన్లు దాఖలు చేసేవారు ఒక్కొక్కటి రూ.50 చొప్పున చెల్లించి దరఖాస్తులు పొందవచ్చని ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి తెలిపారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానాలకంటే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తే జూన్ 11న ఎన్నికలు ఉంటాయన్నారు.
ఈ నెల 31 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని భన్వర్‌లాల్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్ల విషయమై ఆర్వోలతో ఆయన ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. అయితే నోటిఫికేషన్ విడుదలతోనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైనప్పటికీ తొలిరోజైన మంగళవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని తెలుస్తోంది. రాజ్యసభ ఆశావహులు మాత్రం పార్టీల అధినేతల వద్దకు క్యూ కట్టారు. ఈ సారి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కాగా కొంతమంది మీడియా అధిపతులు కూడా ఈ రేసులో ఉన్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.