మోదీని ఇంప్రెస్ చేయడానికే ఆ డ్రెస్ వేసుకున్నా: రాఖీ
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఎప్పుడూ ఏదో వివాదం రాజేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో ఉన్న డ్రెస్ ని వేసుకుని వరల్డ్ మీడియాను తనవైపుకు తిప్పుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా షికాగోలో ప్రీ ఇండిపిండెన్స్ డే కార్యక్రమానికి రాఖీ హాజరైంది. అక్కడ మోదీ బొమ్మలు ఉన్న స్కర్ట్ ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
దీనిగురించి మీడియా ప్రస్తావిస్తే.. ‘మోదీజీ నా డ్రీమ్ మ్యాన్.. బీజేపీని ముఖ్యంగా మోదీజీని, అమిత్ షాని ఇంప్రెస్ చేయడానికే ఈ డ్రెస్ వేసుకున్నా.. మోదీ బెస్ట్ ప్రధాని .. ఆయన గొప్పతనం గురించి ఈ డ్రెస్ వేసుకుని మరీ అమెరికాలో ప్రచారం చేస్తున్నా.. మీరు నా డ్రెస్ గురించి ప్రచారం చేసి సమయం వృధా చేసుకోకండి.. దేశంలో చర్చించాల్సిన అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి’ అంటూ ఎదురుదాడి చేసింది.
ఈ డ్రెస్ గురించి మోదీ అభిప్రాయం తెలుసుకోవడానికి ఆయనకు డ్రెస్ పంపానని.. దీనికి ఆయన కూడా అంగీకరించారని చెబుతోంది. మోదీజీ ఒకే అంటే.. భవిష్యత్తులో బీజేపీలో చేరే ఉద్దేశ్యం ఉందని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.