Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

అయినా.. ఆ హీరోయిన్‌కు ఛాన్స్‌లే ఛాన్స్‌లు!

By   /  April 28, 2016  /  Comments Off on అయినా.. ఆ హీరోయిన్‌కు ఛాన్స్‌లే ఛాన్స్‌లు!

    Print       Email

actress-rakulఏ హీరోయిన్‌కు అయినా వ‌రుస ప్లాప్‌లు వ‌స్తే ఏమ‌వుతుంది.. ఆమె అడ్ర‌స్ లేకుండా పోతుంది.. ఆమె పేరు ఎక్క‌డా క‌నిపించ‌కుండా పోతుంది…కొంత కాలానికి ప్రేక్ష‌కులు ఆమెనే మ‌రిచిపోయేట‌ట్లు చేస్తుంది. కానీ ఇక్క‌డ జ‌రిగింది మాత్రం అందుకు రివ‌ర్స్‌.. వ‌రుస ప్లాప్‌లు వ‌స్తున్నా ఆ హీరోయిన్‌కు మాత్రం ఛాన్స్‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికీ ఆమె చేతిలో నాలుగు సినిమాల‌తో బిజీగా ఉంటోంది. సన్నజాజి తీగలాగా…కరెంట్ వైరులాగా చూడగానే బాపు బొమ్మలా అందంగా క‌నిపిస్తున్న‌ర‌కుల్ ప్రీత్ సింగ్‌కుమాత్రం  సినిమా అవ‌కాశాలు త‌గ్గ‌డం లేదు. తెలుగులో ఎంట్రీ ఇచ్చేముందు కన్నడ, బాలీవుడ్ సినిమాలలో నటించినా అంతగా పేరు రాలేదు. తెలుగులోనూ తొలి సినిమా ఫ్లాప్ తర్వాత మలి చిత్రంగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఇప్పటిదాకా 10 చిత్రాలలో నటించిన రకుల్‌కు అందులో రెండు చిత్రాలు తప్ప మిగిలినవన్నీ అపజయం పొందినవే కావడం గమనార్హం. అయినా రకుల్‌కు అవకాశాలు మాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం చేతిలో నాలుగు ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది. ఏది ఏమైనా ఇలాంటి అవ‌కాశాలు చాలా త‌క్కువ మంది హీరోయిన్‌ల‌కే అవ‌కాశాలు వ‌స్తాయి. ఇలా వ‌స్తున్న అవ‌కాశాల‌ను ర‌కుల్‌ప్రీత్ సింగ్ ఎలా ఉప‌యోగించుకుంటుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →