చరణ్ బోయపాటి రికార్డ్స్..!
మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉండగానే రికార్డులు కొల్లగొడుతుంది. మొదటి షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకున్న ఈ సినిమా హింది డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ కలుపుకుని 22 కోట్లకు అమ్ముడయ్యాయట. ఓ సౌత్ సినిమాకు ఈ రేంజ్ లో డిమాండ్ ఉండటం గొప్ప విషయం. ధ్రువ తర్వాత చరణ్ క్రేజ్ మరింత పెరిగింది.
బోయపాటి శ్రీను సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో చెర్రి, బోయపాటి బాక్సులు బద్ధలు కొట్టడం ఖాయమని అంటున్నారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా దసరా బరిలో దించాలని చూస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.