Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ram Charan movie shooting starts soon..!

By   /  March 9, 2017  /  Comments Off on Ram Charan movie shooting starts soon..!

    Print       Email

ram charanచెర్రీ సినిమా షూరూ అయింది..!

 

InCorpTaxAct
Suvidha

 

 

రామ్ చరన్ నటించిన ‘ధృవ’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపించాడు చెర్రీ. ఈ చిత్రం భారీ హిట్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు అందరి చూపు నెక్ట్స్ మూవీపై పడింది. అయితే మెగా వారసుడు కాస్తంత విరామం కూడా తీసుకున్నాడు. అలాగే తర్వాతి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

అయితే నెక్ట్స్ మూవీ ఇప్పటికే ఒకే అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. కాని ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు. దీంతో మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కిస్తోంది. ఈ నెల 20 నుంచి మెయిన్ రోల్స్ పోషిస్తున్న నటీనటులపై చిత్రీకరణ జరగనుంది. ఇక సమంత 22 నుంచి వీరితో కలుస్తుంది.

ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుందట. అలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడని టాక్. సినిమాలో వాడే కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయని టాక్. ముఖ్యంగా ఈ చిత్రాన్ని తెలంగాణ, ఏపీ, తమిళనాడులలో చిత్రీకరించనున్నట్లుగా మూవీ యూనిట్ తెలిపింది. వచ్చే జూలై నాటికి సినిమాని పూర్తి చేస్తామని తెలిపింది. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే నాలుగు పాటలను కంపోచేశారని వెల్లడించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →