Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Ram Charan politics ..?

By   /  March 24, 2016  /  Comments Off on Ram Charan politics ..?

    Print       Email

ram charan  2 రాజకీయాల్లోకి రామ్ చరణ్..?

 

InCorpTaxAct
Suvidha

 

చిరంజీవి పాలిటిక్స్ నుంచి మూవీస్ లోకి వస్తూంటే.. ఆయన తనయుడు రామ్ చరణ్ మాత్రం సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అయితే.. ఆయన నిజమైన పాలిటిక్స్ లోకి అడుగుపెట్టడం లేదండోయ్.. కేవలం రీల్ రాజకీయాల్లోకి మాత్రమే వెళ్తున్నారు. రీసెంట్ గా తెరమీదికొచ్చిన ‘రన్’ మూవీ డైరెక్టర్ అనిల్ కృష్ణ కన్నెగంటి రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో ‘అసాధ్యుడు’, ‘మిస్టర్ నూకయ్య’ చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు ‘మిస్టర్ నూకయ్య’ సమయంలోనే ఓ కథను చెర్రీకి వినిపించాడట. ఆ కథ రామ్ చరణ్‌కి నచ్చినా అప్పట్లో ఆ సినిమా చేయడం కుదరలేదని టాక్. అయినా సదరు దర్శకుడు పట్టువదలని విక్రమార్కుడిలా చెర్రీతో ఎలాగైనా రాజకీయాల నేపథ్యంలో ఉండే చిత్రం తీసి అందులో.. రాజకీయ ఉపన్యాసాలు చెప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. అన్నీ సహకరిస్తే వచ్చే ఎన్నికలలోపు ఈ సినిమా తెరమీదికి వెళ్ళే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘తనీ ఒరువన్’ రీమేక్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అది పూర్తయితే కానీ రామ్‌చరణ్‌ తర్వాత సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈలోపల రామ్‌చరణ్ రాజకీయాలు ఎలా ఉంటాయన్నది అభిమానుల తమకు నచ్చిన రీతిలో ఊహించుకోవడమే మరి..

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →