Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Ram Gopal Varma Hoardings Appears Overnight In Vijayawada..!

By   /  February 27, 2016  /  Comments Off on Ram Gopal Varma Hoardings Appears Overnight In Vijayawada..!

    Print       Email

rgv

బెజవాడ వచ్చిన వర్మ.. హోర్డింగ్స్ తో వెల్ కమ్ చెప్పిన అభిమానులు..

InCorpTaxAct
Suvidha

 

‘వంగవీటి’ సినిమా కోసం బెజవాడ వస్తా.. హోటల్ లో ఉంటా అని చెప్పిన వర్మ.. చెప్పినట్లుగానే వచ్చేశారు. ఇక ఆయనకు వెల్ కమ్ చెబుతూ విజయవాడ అంతటా రాత్రికి రాత్రి హోర్డింగులు వెలిశాయి. వర్మ అభిమానులు నగరమంతా భారీ కటౌట్లు పెట్టి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక వర్మ తాను ఏ ఫ్లైట్ లో వస్తానని చెప్పారో అదే సర్వీస్ లో విజయవాడలో ల్యాండ్ అయ్యారు. అయితే అదే ఫ్లైట్ లో దేవినేని నెహ్రూ కూడా రావడం విశేషం. ఇక ఒకే విమానంలో ఇద్దరూ రానున్నారని సమాచారంతో గన్నవరం ఎయిర్ పోర్టు సందడి సందడిగా మారిపోయింది. నెహ్రు కోసం కొన్నికార్లు సిద్దంగా ఉండగా.. వర్మను తీసుకెళ్ళేందుకు రెండు ఫార్చూనర్లను రెడీగా ఉంచారు. ఇక ఎయిర్ పోర్టులో దిగిన వర్మ మీడియాతో కూడా రెండు ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోయారు.

 

తన సినిమా గురించి క్లుప్తంగా చెప్పారు. సినిమాలో క్యారెక్టర్లకు సంబంధించి అందరితో మాట్లాడుతానని చెప్పారు. తాను అందుకే విజయవాడ వచ్చానన్నారు. ఇక విమానంలో తనతో పాటు దేవినేని నెహ్రూ ఉన్నారన్న విషయం తెలీదన్నారు. తాను బెజవాడలో మూడు రోజులు ఉంటానని చెప్పారు. వర్మ రాకతో విజయవాడలో కాసింత వాతావరణం వేడెక్కినట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో కొందరు చర్చించుకుంటున్నారట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →