Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Ram Gopal Varma’s ‘aag’ on Vijay Mallya and his ‘bikini babes’

By   /  March 12, 2016  /  Comments Off on Ram Gopal Varma’s ‘aag’ on Vijay Mallya and his ‘bikini babes’

    Print       Email

RGV COMMENTS ON VIJAY MALYA 1

విజయ్ మాల్యాపై ఆర్ జీ వీ సంచలన వ్యాఖ్యలు..

InCorpTaxAct
Suvidha

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కొత్తేంకాదు. అలాగే ఆయన ట్విట్స్ తో కూడా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తూంటారు. తాజాగా ఆయన కింగ్‌ఫిషర్‌ మాజీ ఛైర్మన్‌ విజయ్‌ మాల్యాపై అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో ఆర్ జీ వీ మళ్లీ వార్తల్లోకెక్కారు. ట్విట్టర్‌ వేదికగా మాల్యాపై ఆయన పలు ట్వీట్లు చేశారు. బ్యాంకర్లు ఆయనకు ఇచ్చిన వేల కోట్ల అప్పులు కట్టే బదులు మాల్యా దగ్గర ఉన్న క్యాలెండర్‌ గర్ల్స్‌ని ఒక్కొక్కరినీ ఒక్కొక్క బ్యాంకుకు ఇవ్వమని సలహా ఇచ్చారు. అప్పుడు ఈ గొడవంతా సద్దుమణిగిపోతుందంటూ సంచలన ట్వీట్‌ చేశారు. మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్‌ గర్ల్స్‌ ఆస్తులు ఏమైనా పెరిగి ఉంటే.. మరి వారు రుణం తీర్చాలి కదా.. అంటూ వ్యాఖ్యానించారు. మాల్యా ఈ ఆఫరిస్తే బ్యాంకులు అంగీకరించకపోవచ్చు.. అయితే బ్యాంకర్లు అంగీకరిస్తారు.. అంటూ చురకలు అంటించారు. క్యాలెండర్‌ గర్ల్స్‌లో కొంత మంది బాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లను సైతం ప్రస్తావించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజయ్ మాల్యా అప్పులపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్ జీ వీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →