Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ram Jethmalani response on Kejriwal case..

By   /  April 4, 2017  /  Comments Off on Ram Jethmalani response on Kejriwal case..

    Print       Email

ram jetmalaniపేదలకు ఉచితంగా వాదిస్తా.. కేజ్రీవాల్ కేసుపై రాంజఠ్మలానీ స్పందన..

 
పరువు నష్టం దావా కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దగ్గర పైసా కూడా ఫీజు తీసుకోనని ప్రముఖ న్యాయవాది రాంజఠ్మలానీ వ్యాఖ్యానించారు. తాను పేదలకు ఫ్రీగా వాదిస్తానని అన్నారు. ఈ కేసు విషయంలో ఏకంగా మూడు కోట్లకు పైగా బిల్లును జఠ్మలానీకి కేజ్రీవాల్ పంపించడం వివాదాస్పదమైంది. దీంతో ఆయన ఈ మేరకు స్పందించారు.

InCorpTaxAct
Suvidha

ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అంశంలో అరుణ్ జైట్లీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జైట్లీ ఆయనపై కేసు వేశారు. తన పరువుకు భంగం వాటిల్లిందని పదికోట్లు కట్టాలంటూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ కేసు విషయంలో రాంజఠ్మలానీ వాదించినందుకు కేజ్రీవాల్ దాదాపుగా మూడు కోట్ల మేర బిల్లును పంపించారు. కోర్టులో వాదించేందుకు కోటి , అలాగే కోర్టుకు హాజరైన ప్రతిసారి రూ.22 లక్షల చొప్పున బిల్లు వేశారు.

ఇక ఆ ఫీజును తాను వ్యక్తిగతంగా కట్టలేనని ఢిల్లీ ప్రభుత్వ ధనాన్ని వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ గవర్నర్ కు లేఖ రాశారు. దీంతో ఆయన నిపుణుల కమిటీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలాఉంటే కేజ్రీవాల్ లేఖ రాయడం వివాదంగా మారింది. ఈ విషయంలో ప్రజా ధనాన్ని ఎలా వినియోగించుకుంటారని ఆయన్ను విపక్షాలు తీవ్రంగా ప్రశ్నించాయి. ఇక రాంజెఠ్మాలానీ స్పందించి ఢిల్లీ ప్రభుత్వం గాని కేజ్రీవాల్ గాని ఫీజు చెల్లించకపోయినా తాను వాదిస్తానని తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →