Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Ramanuja charya statue in Hyderabad

By   /  December 12, 2016  /  Comments Off on Ramanuja charya statue in Hyderabad

    Print       Email

ramanuja-charyaఆ విష‌యంలో హైద‌రాబాద్‌కు ప్ర‌పంచంలోనే రెండవ స్థానం

 

InCorpTaxAct
Suvidha

 

 

* శంషాబాద్ స‌మీపంలోని ముచ్చింత‌ల్‌లో  216 అడుగుల రామానుజాచార్య విగ్ర‌హం

* ప్ర‌పంచంలోనే ఎత్తైన విగ్ర‌హాల్లో థాయ్‌ల్యాండ్‌లోని 302 అడుగుల గ్రేట్ బుద్ధ విగ్ర‌హం

* రెండ‌వ స్థానం సంపాదించుకోనున్న హైద‌రాబాద్‌

హైద‌రాబాద్ కీర్తి కిరీటంలో మ‌రో ఘ‌న‌త చేర‌బోతోంది. ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోబోతోంది. ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త రామానుజాచార్య 1000వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శంషాబాద్ స‌మీపంలోని ముచ్చింత‌ల్‌లో 216 అడుగుల ఎత్తైన ఆయ‌న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విగ్రహం ఖ్యాతి దక్కించుకోనుంది. థాయ్ లాండ్ లో ఉన్న 302 అడుగుల గ్రేట్ బుద్ధ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం కాగా రామానుజయ విగ్రహం రెండో స్థానం దక్కించుకోనుంది. దాదాపుగా రూ.250 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న ఈ విగ్రహానికి కావాల్సిన సొమ్ము విరాళాల రూపంలో వచ్చినట్లు నిర్మాణ సంస్థ సీఈఓ ఎస్ఎం బాలసుబ్రమణ్యం మీడియాకు తెలిపారు. ఈ విగ్రహం మొదటి దశ వచ్చే ఏడాది నవంబరు కల్లా పూర్తి అవుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.1000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. రామానుజాచార్య విగ్రహం పూర్తయితే హైదరాబాద్ కీర్తిలో మరో విశేషం జత అవుతుందని విశ్లేషిస్తున్నారు.

కాగా ఈ విగ్రహాన్ని చైనాకు చెందిన నిపుణులు తయారు చేశారు. 4 అడుగుల ఎత్తైన భవనంపై ప్రతిష్టించనున్న ఈ విగ్రహానికి చెందిన విడిభాగాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. చిన్నజీయర్ స్వామి ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మిస్తున్న ఈ విగ్రహం కోసం 700 టన్నుల పంచలోహాలను వాడనున్నారు. బంగారం వెండి రాగి సీసం ఇనుములతో రామానుజాచార్య విగ్రహాన్ని తీర్చిదిద్దనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →