శరవేగంగా ‘హైపర్’ షూటింగ్..
ఎనర్జిటిక్ హీరో రామ్ – ప్రముఖ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో.. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న మూవీ ‘హైపర్’. ఈ సినిమాని ప్రముఖ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్యాగ్ లైన్ ‘ప్రతి ఇంట్లో ఒకడుంటాడు’. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడారు. ” ‘హైపర్’ – ప్రతి ఇంట్లో ఒకడుంటాడు టైటిల్ కి మంచి స్పందన వచ్చింది.టైటిల్ కి తగ్గట్లుగానే తమ సినిమా మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ప్రెజెంట్ ఈ చిత్రం షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. 20 వరకు జరిగే ఈ షెడ్యూల్ లో మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుంది. సెప్టెంబర్ సెకెండ్ వీక్ లో ఆడియోని విడుదల చేయాలని భావిస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 30న విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం” అన్నారు.
హీరో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్: అవినాష్ కొల్లా, ఎడిటింగ్: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీన్వాస్.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.