రానా.. వరుణ్ మల్టీస్టారర్..!
దగ్గుబాటి రానా మెగా హీరో వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రముఖ తమిళ దర్శకుడు సాల్మన్ రాజ్ డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ వెంకటేష్ తో కలిసి అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్-2 సినిమా ఓకే చేశాడు. త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది.
రానాకు ఎలాగు బాహుబలితో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాతో తమిళ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఫిదాతో కమర్షియల్ హిట్ అందుకోగా ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో తొలిప్రేమ సినిమా చేస్తున్నాడు. రానా, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ఎలా ఉంటుందో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.