Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

RangaStalam collected 100 Crores at World Wide Box Office

By   /  April 2, 2018  /  Comments Off on RangaStalam collected 100 Crores at World Wide Box Office

    Print       Email

క‌థ న‌చ్చితేనే సినిమా

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* రూ.100 కోట్లు వ‌సూలు చేయ‌డం ఆనందంగా ఉంది
* రంగ‌స్థ‌లంను విజ‌య‌వంతం చేసిన అంద‌రికీ థ్యాంక్స్‌
* మీదియా స‌మావేశంలో రామ్‌చ‌ర‌ణ్‌

డెక్క‌న్ అబ్రాడ్‌: “మ‌ంచి సినిమాల‌ను ప్ర‌జ‌లు ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉంటార‌న్న‌ది మ‌రోసారి నిజ‌మైంది. చాలా క‌ష్ట‌ప‌డి సినిమాను ప్రేక్ష‌క దేవుళ్లు విజ‌య‌వం చేశారు. క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కింది“ అని హీరో రామ్‌చ‌ర‌ణ్ అన్నారు. రంగ‌స్థ‌లం సినిమా విడుద‌లై నాలుగు రోజులు కాక‌ముందే రూ.100 కోట్లను వ‌సూలు చేసిందంటూ ఓ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా చెర్రీ మాట్లాడారు. ‘‘అభిమానులను దృష్టిలో పెట్టుకుని కేవలం వాళ్లకు మాత్రమే నచ్చేలా సినిమా చేయాలంటే మాత్రం… ‘రంగస్థలం’ వంటి మంచి సినిమా వచ్చి ఉండేది కాదు. చాలామంది ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఒప్పుకుంటారా… అని అడుగుతుంటారు. కానీ నిజం చెప్పాలంటే కథ ముందుగా నచ్చాల్సింది మాకు. మాకు నచ్చితే… నా అభిమానులకూ- నా కుటుంబానికీ- అందరికీ గర్వపడే ఇలాంటి సినిమాలు వస్తాయి“ అని రామ్ చ‌ర‌ణ్ అన్నారు.
అంతేకాదు “నేను ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఒప్పుకునే కమర్షియల్ హీరోని కాదు. నన్నూ… నటీనటులందరినీ… టెక్నికల్ టీం అందరినీ నమ్మి… తన క్రేజీ విజన్ ను తెరకెక్కించిన సుక్కూకి థ్యాంక్స్. సినిమా విజయవంతం అయిన దాని కంటే నన్ను నమ్మి సినిమాను కొన్నవారికి డబ్బులు వచ్చాయని తెలిసి సంతోషంగా ఉంది. వచ్చిన డబ్బులను మళ్లీ ఇంకో సినిమా మీద పెట్టే బయ్యర్లు… డిస్టిబ్యూటర్లు సంతోషంగా ఉంటేనే సినిమాలు తీసే మేం సంతోషంగా ఉంటాం…’’ అని కూడా అన్నారు. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలని ఉందని… వారందరి గురించి మరో ఫంక్షన్ చేసి మాట్లాడతానని చెప్పుకొచ్చాడు చెర్రీ.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →