`రంగస్థలం` ఒక జీవితంలా అనిపించింది
* చిట్టిబాబులో రామ్‌చరణ్ ఒదిగిపోయాడు
* రామ్‌చరణ్‌లో తపన ఉంది
* `రంగస్థలం` ఆస్కార్‌కి వెళ్లాలి
* `రంగస్థలం` విజయోత్సవంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్
డెక్కన్ అబ్రాడ్: “రంగస్థలం` సినిమా చూస్తున్నప్పుడు అది నాకు సినిమాలా అనిపించలేదు. `రంగస్థలం` అనే ఊరికి వెళ్లొచ్చినట్టు అనిపించింది. ఒక జీవితంలా అనిపించింది. బావితరాలకు వాస్తవికతను అందించింది. ఇది చాలా మందికి స్పూర్తిదాయకం“ అపి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. `రంగస్థలం విజయోత్సవ సభలో పవన్ కల్యాణ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ‘చిట్టిబాబు నా తమ్ముడు.. నా అన్నయ్య, నాకు తండ్రి.. నా వదిన నాకు అమ్మ’ అంటూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో అభిమానుల సమక్షంలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ `రంగస్థలం` సినిమా ఆస్కార్ సాధించాలని ఆకాక్షించారు. `రంగస్థలం` మూవీ కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా భారతీయ చలన చిత్ర రంగంలోనే గర్వించదగ్గ సినిమా అని, ఇలాంటి సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. `నేను సినిమాలు తీస్తా కాని.. పూర్తిగా చూసింది లేదు. నా సినిమాలు నేను చూసుకోను. ఎప్పుడో ‘తొలిప్రేమ’ చిత్రం హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో చూశా. అది కూడా సగమే చూశా. కాని ఇన్నేళ్ల తరువాత ‘రంగస్థలం’ చిత్రాన్ని థియేటర్‌కి వెళ్లి మరీ చూశా ` అని పవన్ కల్యాణ్ అన్నారు
`రంగస్థలం` సినిమాకు అంతర్జాతీయ చిత్రాలకు వచ్చే రేటింగ్ కంటే ఈ సినిమాకు ఎక్కువ రేటింగ్ రావడం చాలా గర్వంగా ఉందన్నారు. దర్శకుడు సుకుమార్‌తో సినిమాతో చేసే అవకాశం తనకు లభించలేదని, కాని ఆయన తనకు అప్పట్లో కథ చెప్పారు కానీ తరువాత చేద్దాంలే అన్నా అని చెప్పుకొచ్చారు. `రామ్ చరణ్ చిన్నప్పటి నుండి ఏదోటి నేర్చుకోవాలను తపన ఉన్నవాడు. నేను ముసుగు తన్ని పడుకుంటే వీడు హార్స్ రైడింగ్ నేర్చుకునే వాడు. రామ్ చరణ్ సంపూర్ణ నటుడు. నేను ఇలాంటి చిత్రాలు చేయాలని ఉన్నా అలా నటించలేను. ఇలాంటి పాత్రలు మరెన్నో చేయాలని కోరకుంటున్నా. సత్తా ఉన్న నటుడు రామ్ చరణ్` అని పొగడ్తలతో ముంచెత్తాడు పవన్ కల్యాణ్.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.