Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

Revanthreddy blames KCR

By   /  July 1, 2016  /  Comments Off on Revanthreddy blames KCR

    Print       Email

Revanth Reddyరేవంత్ చెప్పిన వాస్త‌వాలు ఏంటి?

తెలంగాణ టీడీపీ ప‌క్ష‌నేత రేవంత్‌రెడ్డి సందుదొరికితే చాలు కేసీఆర్‌పై విరుచుకుప‌డుతుంటారు. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతుంటారు. దీంతో కేసీఆర్ రేవంత్‌ను ఏమీ చేయ‌లేక ఊరుకుండిపోయారు. కానీ ఇప్పుడు స‌మ‌యం వ‌చ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో  రేవంత్ రెడ్డిని  కోలుకోలేని దెబ్బ‌కొట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే కేసీఆర్ త‌న‌ను ఏ విధంగా ఇబ్బంది పెట్ట‌బోతున్నాడ‌నేదానిపై రేవంత్ స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటు మొత్తం కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసమే అన్నట్లుగా ఏర్పాట్లు సాగుతున్నాయ‌ని రేవంత్‌రెడ్డి  ఆరోపించారు. పక్కపక్కనే ఉన్నా సిద్ధిపేట.. మెదక్ లను జిల్లా కేంద్రాలుగా చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రేవంత్.. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న కారణంగా సిరిసిల్లను కూడా జిల్లా కేంద్రంగా చేస్తున్నారన్నారు. కేవలం తొమ్మిది మండలాలతో ఉన్న సిరిసిల్లను జిల్లాగా ఎలా చేస్తారంటూ ప్రశ్నించిన రేవంత్.. తన మీద కోపంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లోని రెండు మండలాల్ని దూరంగా ఉన్న వికారాబాద్ కేంద్రంగా ఉన్న కొత్త జిల్లాలో కలుపుతున్నట్లుగా తనకు తెలుస్తుందని మండిపడ్డారు.

InCorpTaxAct
Suvidha

తన మీద కోపం ఉంటే.. తన మీద కక్ష తీర్చుకోవాలే తప్పించి.. ఆ కారణంగా తన నియోజకవర్గంలోని ప్రజల మీద కక్ష తీర్చుకోవటం ఏ మాత్రం సరికాదని ఆయన తప్పుపట్టారు. తాజాగా తనకు అందుతున్న సమాచారం ప్రకారం జిల్లాలు ఏర్పాటు చేస్తే.. తన నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉంటుందని.. అదే జరిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతారని ఆయన మండిపడుతున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డికి అందుతున్న సమాచారం సరైనదేనా?  కాదా?  అన్న‌ది తెలుసుకోవాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →