Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Ravel is ready quit the party?

By   /  March 6, 2018  /  Comments Off on Ravel is ready quit the party?

    Print       Email

రావెల‌కు ఏమైంది?

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* బాబుకు ఎందుకు టార్గెట్ చేశారు?
* ద‌ళిత ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు మ‌ర్యాద లేద‌ని ఇప్పుడే ఎందుకు అన్నారు?
* పార్టీ మారేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
* టీడీపీలో ఒక్క‌టే చ‌ర్చ‌

డెక్క‌న్ అబ్రాడ్‌: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు చంద్ర‌బాబును ఎందుకు టార్గెట్ చేశారు? బాబు ద‌ళితుల‌ను అవ‌మానిస్తున్నార‌ని ఇప్పుడే ఎందుకు అంటున్నారు? త‌న‌ను మంత్రిప‌ద‌వి నుంచి త‌ప్పించార‌ని రావెల‌కు కోప‌మా? లేక ఆయ‌న మార్టీ మారెందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే అవున‌ని కొంద‌రు.. కాద‌ని కొంద‌రు.. బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో దళిత ప్రజాప్రతినిధులకు మర్యాద.. గౌరవం లభించటం లేదని, తమ ఆత్మగౌరవం దెబ్బ తింటోంద‌ని రావెల కిశోర్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఒక టీవీ ఛానల్లో మాట్లాడిన ఆయన.. బాబు పార్టీపైనా.. సర్కారుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్రం మొత్తమ్మీదా ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. ఏపీ మొత్తంగా ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకుల నేతలదే పెత్తనంగా ఉందన్నారు. ఎస్సీ మంత్రులు.. ఎమ్మెల్యేలకు పదవులు మాత్రమే ఉంటాయని..అధికారం మాత్రం ఉండదన్నారు.
అందుకు ఉదాహరణగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గాన్ని ప్రస్తావించారు. అక్కడ ఎమ్మెల్యే మణిగాంధీ నామమాత్రంగా వ్యవహరిస్తారని.. అక్కడ పెత్తనం మొత్తం టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డిదేనన్నారు. ఈ ఉదాహరణతో వదలని రావెల.. కొవ్వూరు నియోజకవర్గాన్ని ప్రస్తావించారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జవహర్ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారని.. కానీ.. అధికారం మొత్తం మాత్రం సుబ్బరాజు చౌదరిదేనన్నారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుగా ఉన్నప్పటికీ పవర్ మొత్తం అక్కడి ఛైర్మన్ బాపిరాజు చేతులో ఉందన్నారు. వేమూరు నియోజకవర్గం పవర్ అంతా తెనాలి ఎమ్మెల్యే అలపాటిరాజా చేతుల్లో ఉందన్న ఆయన.. ప్రకాశం జిల్లా కొండెపిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. రావెల కిశోర్ ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా చెప్ప‌డంతో టీడీపీ నేత‌లు ఏమీ మాట్లాడ‌లేక‌పోతున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →