రవితేజ ‘రాజా ది గ్రేట్’ టైటిల్ సాంగ్
మాస్ మహారాజా రవితేజకి ఈ మధ్య వరుసగా ప్లాప్ లే ఎదురయ్యాయి. గతంలో రెండు సినిమాలు ప్లాప్ అయితే కనీసం థర్డ్ మూవీతో హిట్ కొట్టేవాడు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో ఎలాగైనా ‘రాజా ది గ్రేట్’ మూవీతో హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ చిత్రం కోసం రవితేజ తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ బ్లైండ్ మేన్ గా కనిపించనున్నాడు. బ్లైండ్ క్యారెక్టర్ కి తనదైన శైలిలో మాస్ యాక్షన్ జోడించి ఈ సినిమా చేసేస్తున్నాడు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా పనిచేస్తున్నాడు. చిత్ర యూనిట్ ఈ మూవీకి చెందిన ఓ సాంగ్ ని రిలీజ్ చేసింది.
ఈ టైటిల్ సాంగ్ ని సాయి కార్తీక్ కంపోజ్ చేశాడు.’రాజా రాజా రాజా ది గ్రేటురా.. నువ్వు తళతళా టూ తౌజెండ్ నోటురా’ అంటూ పాట సాగింది. మధ్యలో నువ్వు కళ్ళు లేనోడివి అని ఎవరో అంటే.. ‘నోర్మూయ్ ఆ టాపిక్ లేకుండా పాడలేవా ?’ అంటూ రవితేజ వాయిస్ వినిపిస్తుంది. శ్యామ్ కాసర్ల రాసిన పాటని రవితేజ, రేవంత్, సాకేత్ పాడగా.. సాయి కార్తీక్ మంచి బాణీని ఇచ్చాడు.ఈ టైటిల్ సాంగ్ తో హీరో ఇంట్రడక్షన్ ఉంటుందని అర్ధమవుతోంది. ‘రాజా ది గ్రేట్’ మూవీని దీపావళి రిలీజ్ చేస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.