విలేజ్ లుక్ తో రాజమౌళి ఫామ్ హౌస్..!
టాలీవుడ్ జక్కన రాజమౌళి తెరకెక్కించే సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలే. అలాగే ఆ సినిమాలు చూసేందుకు చాలా రిచ్ లుక్ తో కనిపిస్తాయి. తన సినిమాల్లో అంతలా రిచ్ లుక్ చూపించే రాజమౌళి మాత్రం నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉంటారు. అందరిలాగానే మామూలు కారు వాడతారు. అంతేకాదు ఎక్కువగా క్యాబ్ లోనే ప్రయాణి స్తూంటారు. ముఖ్యంగా ఆయనకు గ్రామీణ వాతావరణం అంటే ఎంతో ఇష్టమట. అందుకే తన ఫామ్ హౌజ్ ని ఓ విలేజ్ రూపంలో కట్టించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళికి హైదరాబాద్ లో కొంతమేర స్థలం ఉంది. ఇందులో ఓ పెద్ద బిల్డింగ్ నిర్మించాలని భావిస్తున్నారట.అలాగే గ్రామీణ వాతావరణం కనిపించేలా అక్కడక్కడ చిన్న చిన్న ఇళ్ళు ఉంటూ.. వ్యవసాయానికి వీలుగా కట్టించాలని నిర్ణ యించారని సమాచారం. దీనికోసం తన ఫ్రెండ్ అయిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ను డిజైన్ చేయాల్సిందిగా జక్కన కోరారని టాక్.ఇక రవీందర్ రాజమౌళి ఆలోచనలకు తగ్గట్లుగా డిజైన్ చేసే పనిలో ఉన్నారు.మర్యాద రామన్న సినిమాలో కనిపించే హౌస్ సెట్ రవీందర్ డిజైన్ చేసిందే.తర్వాత కూడా ఆ ఇంటిని మరికొన్ని సినిమా షూటింగుల కోసం ఉపయో గించుకున్నారు.మరి రాజమౌళి ఊహాలకు తగ్గట్లుగా రవీందర్ ఫామ్ హౌస్ ఎలా నిర్మిస్తారో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.