Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ready for settlement, tweets Vijay Mallya..

By   /  March 10, 2017  /  Comments Off on Ready for settlement, tweets Vijay Mallya..

    Print       Email

vijay-mallya3సెటిల్ మెంట్ కు సిద్ధమేనని ప్రకటించిన విజయ్ మాల్యా..

 

InCorpTaxAct
Suvidha

 

లిక్కర్ డాన్ విజయ్ మాల్యా సెటిల్ మెంట్ కు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. బ్యాంకులకు వేలకోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు ఆయన చెక్కేశారు. ఈ మేరకు ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులకు రుణాలు చెల్లించే అంశంపై సమస్యను వన్ టైమ్ సెటిల్ మెంట్ తో పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

‘ ప్రభుత్వ రంగ బ్యాంకులకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పాలసీలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది దీన్ని వినియోగించుకున్నారు. తనకు మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు’ అంటూ విజయ్ మాల్యా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ముందు తన ఆఫర్ ను పెట్టానని తెలిపారు. అయితే బ్యాంకులు ఎందుకు తిరస్కరించాయని ప్రశ్నించారు.

తాను బ్యాంకులతో సెటిల్ మెంట్లు చేసుకోవడానికి రెడీ ఉన్నానని తెలిపారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సెటిల్ మెంట్ చేసుకునే విధంగా బ్యాంకులను ఆదేశించాలని కోరారు. తాను న్యాయస్థానం ఇచ్చే ప్రతి ఆదేశాన్ని గౌరవిస్తానని చెప్పారు. విచారణ చేపట్టకుండానే కేంద్ర ప్రభుత్వం తనను దోషిగా చూపిస్తోందని అన్నారు. నిన్నటి విచారణలో సుప్రీంకోర్టు.. న్యాయస్థానానికి అందజేసిన ఆస్తుల వివరాలు నిజమైనవేనా అని మాల్యాని అడిగింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →