Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Regina cassandra got chance to act with Amitabh bachhan ..

By   /  August 20, 2016  /  Comments Off on Regina cassandra got chance to act with Amitabh bachhan ..

    Print       Email

Regina cassandra with amitabh 2అమితాబ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ముద్దుగుమ్మ..?

 

InCorpTaxAct
Suvidha

 

 

టాలీవుడ్ యంగ్ హీరోల ఫస్ట్ ఛాయిస్ ఎవరు అంటే.. ఠక్కున రెజీనా పేరు చెబుతారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరోల సరసన నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇప్పుడు ఈ అందాల తార లక్కీ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. వీరి కాంబినేషన్ లో పదేళ్ల కిందట వచ్చిన ఓ మూవీకి సీక్వెల్ తీయబోతున్నారట. 2002లో వచ్చిన ‘ఆంఖేన్’ మూవీకి సీక్వెల్ తీయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఇందులో రెజీనా హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్ లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అర్జున్ రాంపాల్, సుస్మితా సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ప్రస్తుతం రెజీనా ‘నక్షత్రం’ సినిమాలో నటిస్తోంది. అలాగే..యంగ్ హీరో మంచు మనోజ్ తో మరో సినిమాలో కనిపించనుంది. ఇదిలాఉండగా.. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ‘జో అచ్యుతానందా’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇవి కాకుండా తమిళంలో మరో రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తాజాగా అమితాబ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఒకవేళ రెజీనా నటిస్తున్న ఈ సీక్వెల్ సక్సెస్ అయితే బాలీవుడ్ లో ఈ బ్యూటీకి తిరుగుండదు. మరిన్ని ఛాన్స్ లు దక్కే అవకాశం ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →