Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

చీకటి’నే ఆరగిస్తు బ్రతికేస్తా కులాసాగ..!

By   /  June 9, 2016  /  No Comments

    Print       Email

13256381_901177153343640_3435515188797853952_nచీకటి’నే ఆరగిస్తు బ్రతికేస్తా కులాసాగ..!
వెన్నెలసిరు లందిస్తూ గడిపేస్తా కులాసాగ..!

నిరాశలను మనువాడే మనసు కాస్త మారును’లే..!
నన్ను నేను వెన్నంటే నడిచేస్తా కులాసాగ..!

InCorpTaxAct
Suvidha

ఆశయాల రథ సారథి నా చక్కని సంకల్పమె..!
నీ పెదవుల చిరునవ్వై వెలిగేస్తా కులాసాగ..!

ఎగురుతున్న గాలిపటం దారమెక్క డున్నదోయి..!?
గుండెలయల సన్నాయిగ మ్రోగేస్తా కులాసాగ..!

ప్రేమతోట పూలంటే నీ మైత్రీ హాసాలే..!
నీ మౌనపు వసంతాలు పంచేస్తా కులాసాగ..!

నీ ప్రేయసి నేనైతే చాలులేర ఓ మాధవ..!
కలకాలం కలహంసగ ఉండేస్తా కులాసాగ..!

 

Author: Madhav Rao Koruprolu

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →