
రెండు దశాబ్దాలకు పైగా అట్లాంటాలో వుంటూ, సాహితీ కృషిని కొనసాగిస్తూ ఎన్నో అవార్డులను, పురస్కారాలను అందుకొన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఫణి. కొన్ని వందల సాహితీ కార్యక్రమాలు, మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, స్వయంగా పాల్గొంటూ, తన సాహితీ సేద్య ఫలంగా ఇప్పటివరకు రెండు కథా సంపుటులను ప్రచురించి అభిమానుల ఆదరణకు పాత్రుడయ్యాడు. 2014 లో శ్రీ.అక్కినేని నాగేశ్వర రావు స్మారక పురస్కారం గా వంశీ ఇంటర్నేషనల్ సంస్థ “సాహితీ రత్న” బిరుదునిచ్చి గౌరవించింది. ప్రముఖ సాహితీ వేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి కీర్తిశేషులు డాక్టర్ పెమ్మరాజు వేణుగోపాలరావు గారి పేరిట నెలకొల్పిన బంగారు పతకం కూడ ఫణి ని వరించింది. ఫణి రాసిన మొదటి కథాసంకలనం “పల్లకీ” భారత దేశంలోని రాజా రామ మోహనరాయ్ ఫౌండేషన్ ద్వారా అరుదైన గుర్తింపుని పొందింది.


తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, మారిపోతున్న విలువలకు, తరాల అంతరాలకూ, మరుగున పడిపోతున్న మనదైన తెలుగుదనానికీ అద్దంపట్టే గొప్ప చిత్రం పల్లకీ. ఈ చిత్రానికి అమెరికాలోని “వరల్డ్ ఫెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్” పోటీలో అరుదైన గొప్ప గౌరవం దక్కింది. గొప్ప దర్శకులకు ఇచ్చే “రెమి ఇంటర్నేషనల్” అవార్డు ను “పల్లకీ” చిత్రం ద్వారా మన ఫణి అందుకోబోతున్నాడు. 2016 ఏప్రిల్ రెండవ వారంలో హ్యూష్టన్ నగరంలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో “పల్లకీ” ప్రదర్శితమౌతుంది. వరల్డ్ ఫెస్ట్ సంస్థ గత 49 సంవత్సరాలుగా ఇంటర్నేషల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్న గొప్ప సంస్థ. స్టీవెన్ స్పీల్బర్గ్, జార్జి లూకాస్ వంటి ప్రముఖుల తొలి చిత్రాలను, ఆనాడే ఈ సంస్థ వారు ఎంపిక చేసి, ప్రదర్శించి వారిని ప్రోత్సహించారు. అటువంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అవార్డును అందుకొన్న ఫణి ని అమెరికాలోని అన్ని తెలుగు జాతీయ సంఘాలు గుర్తించి, తమ కన్వెన్షన్లలో ప్రత్యేక గౌరవాన్ని అందచేసి ప్రోత్సహించాలి. అలాగే ఔత్సాహికులైన ఎన్.ఆర్.ఐ నిర్మాతలు, భారతదేశ నిర్మాతలు ఫణి కి తోడుగా నిలిచి ప్రోత్సహిస్తే, ఫణి ఎన్నో చక్కని సినిమాలు మనకు అందిస్తాడనడంలో సందేహం లేదు.
Phani Can be reached at : phanidokka@yahoo.com (404-435-0309).
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.