Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Reports of active shooter at JFK Airport can’t be confirmed

By   /  August 15, 2016  /  Comments Off on Reports of active shooter at JFK Airport can’t be confirmed

    Print       Email

newyork airportజేఎఫ్ కె ఎయిర్ పోర్టులో కాల్పులు ఘటన ఉత్తిదే..!

 

InCorpTaxAct
Suvidha

 

న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో శనివారం కాల్పుల జరిగాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఎయిర్ పోర్టును స్వాధీనంలోకి తీసుకున్నారు. అనంతరం క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చివరకు కాల్పులు జరగడం ఉత్తిదే అని తేల్చారు. తాము కాల్పుల శబ్ధాలు విన్నట్లుగా ఇద్దరు వ్యక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో భద్రతా దళాలు ఎయిర్ పోర్టును క్షుణ్ణంగా గాలించాయి. అనంతరం అక్కడ కాల్పులు జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తేల్చాయి. సీసీ ఫుటేజీలో కూడా ఎలాంటి దృశ్యాలు రికార్డ్ కాలేదని వెల్లడించాయి.

ఎయిర్ పోర్టు అథారిటీ పోలీసులు ఎయిర్ పోర్టు దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కలకలం సందర్భంగా ఎవరూ గాయపడలేదని చెప్పారు. తాము ఎవరిని అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. కాల్పుల కలకలంపై మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో ఆందోళన వ్యక్తమైంది. ఈ వార్తలకు తోడు సోషల్ మీడియాలో కూడా పుకార్లు షికార్లు చేశాయి. తనిఖీలు అనంతరం అంతా ఉత్తిదే అని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు.. కాల్పులు శబ్ధాలపై ఫిర్యాదులు రావడంతో న్యూయార్క్ పోలీసులు బలగాలు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టు దగ్గర మోహరించాయి. ముఖ్యంగా హెర్క్యులెస్‌ స్ట్రైక్‌ టీం, క్రిటికల్‌ రెస్పాన్స్‌ కమాండ్‌, స్ట్రాటెజిక్‌ రెస్పాన్స్‌ గ్రూప్‌, ఎమర్జెన్సీ సర్వీసు గ్రూప్‌, గస్తీ పోలీసులను అక్కడకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణీకులు భయంతో బయటకు పరుగులు పెట్టారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →