Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Revanth reddy fires on TRS..

By   /  March 28, 2016  /  Comments Off on Revanth reddy fires on TRS..

    Print       Email

revanth reddy new

సర్కారుపై రేవంత్ రెడ్డి విమర్శలు

InCorpTaxAct
Suvidha

 

 

ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ కింద రూ.4750 కోట్లు ఎందుకని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం రూ.500 కోట్లు ఆయన దగ్గర పెట్టుకుని రూ.4250 కోట్లను రుణ మొత్తానికి తరలించాలని సూచించారు.అలా అయితే నూరు శాతం మేర రుణమాఫీ అమలవుతుందన్నారు. బడ్జెట్‌ పద్దులపై చర్చలో భాగంగా ఆయన నిన్న అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణలో 2351 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం.. భారతదేశంలోనే సెకెండ్ ప్లేస్ లో ఉందన్నారు. ప్రభుత్వం మాత్రం 342 రైతు కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించిందన్నారు. ఆ వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. కావాలంటే వాటిని సభకు అందిస్తామన్నారు.

సర్కారు తక్షణం రైతు ఆత్మహత్యల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల్లో భరోసా నింపేందుకు మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ తరహాలో సీఎం కేసీఆర్‌ కూడా ప్రతి మండలంలో పర్యటించాలని అన్నారు. సోలార్‌ పంపుసెట్లు ఏమయ్యాయని సభా ముఖంగా రేవంత్ ప్రశ్నించారు. పోలీసుశాఖలో అన్ని విభాగాలనూ ఒకే గొడుగు కిందకు తెస్తామన్న హామీ అమలు కావడం లేదన్నారు. పోలీసు అధికారులకు వారాంతపు సెలవులు, ఇతర సెలవులు ఇస్తున్నా పోలీసులకు మాత్రం ఇవ్వడం లేదన్నారు.

మంచి ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీల విడుదల హామీ కూడా నెరవేరలేదని అన్నారు. దీనిపై హోంమంత్రి నాయిని స్పందిస్తూ అలాంటి హామీ తాము ఇవ్వలేదనారు. అయితే ఆధారాలు కావాలంటే ఇస్తానని రేవంత్ బదులిచ్చారు. రాష్ట్రంలోని 10 జిల్లాలను 24 జిల్లాలుగా చేస్తామన్న టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు జరగలేదన్నారు. ఎలాచేసినా మూడునాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా అవుతుందన్నారు. పరిపాలనపరంగా ఎంతో ప్రయోజనం ఉండదన్నారు. దీనివల్ల ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం ప్రాతిపదికన 17 జిల్లాలు చేయాలని సూచించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →