Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Revanth Reddy response on Pawan – KCR meeting

By   /  January 2, 2018  /  Comments Off on Revanth Reddy response on Pawan – KCR meeting

    Print       Email

సీఎం కేసీఆర్ మాయలో పవన్ పడిపోయారు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. పవన్ దగ్గర సమాచారం లేదని అన్నారు. అందుకే ఆయన కేసీఆర్ మాయలో పడిపోయారని అన్నారు. అందువల్ల ఆయనకు సమాచారం అందించే బాధ్యత తమపై ఉందని భావిస్తున్నామని అన్నారు.

గతంలో ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిజాలే మాట్లాడారని అన్నారు. విభజన చట్టం ప్రకారం విద్యుత్ సంస్థలను విభజిస్తే తెలంగాణకు 42 శాతం వాటా మాత్రమే వస్తుందని అన్నారు. అలాకాకుండా కాంగ్రెస్ నేతల కృషి ఫలితంగా వాడకాన్ని బట్టి విభజించారని అన్నారు. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. వాటి పనికి ఆటంకాలు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేతలు కృషి చేశారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉదయ్ స్కీమ్ లో భాగంగానే తెలంగాణకు కరెంట్ అధికంగా వస్తోందని అన్నారు. దానికి రైతులకు నిరంతర విద్యుత్ పేరుతో కలరింగ్ ఇచ్చి కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయాలను పవన్ కల్యాణ్ గమనించలేకపోయారని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAGC 2019 Women’s Day Celebrations

Read More →