అసెంబ్లీలోకి టీడీపీ సభ్యులకు నో ఎంట్రీ.. రోడ్డుపై బైఠాయించిన సండ్ర రేవంత్ రెడ్డి
ముస్లీం-ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఆదివారం తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. దీనికోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశానికి టీడీపీ సభ్యులకు ఎంట్రీ లభించలేదు. దీనికి కారణం వారిపై సస్పెన్షన్ వేటు ఉండటమేనని తెలుస్తోంది. ఇక ఈ ఉదయం టీడీపీ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు.
అయితే స్పీకర్ అనుమతి లేనిదే లోపలికి పంపించలేమని భద్రతాధికారులు వెల్లడించారు. దీంతో టీడీపీ సభ్యులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ కారణంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు వైపు ఉన్న ఇనుప కంచెకు బయటి వైపున ‘తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడండి – తెలుగుదేశం పార్టీ’ అని రాసి ఉన్న బ్యానర్ ను ప్రదర్శించారు. ఇదిలాఉండగా ముస్లీంలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అసెంబ్లీకి పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.