Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

RGV released ‘Lakshmi’s NTR’ first look..

By   /  September 27, 2017  /  Comments Off on RGV released ‘Lakshmi’s NTR’ first look..

    Print       Email

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఆర్జీవీ..

 

InCorpTaxAct
Suvidha

 

టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు దివంగత నందమూరి తారక రామారావు జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కిస్తామని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఆయన చిత్రానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని టైటిల్ కూడా ప్రకటించారు. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూవీ మొత్తం లక్ష్మీ పార్వతి యాంగిల్ లోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

తాజాగా వర్మ ఈ మూవీకి చెందిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బ్లూ కలర్ చీర ధరించిన ఓ మహిళ ఇంట్లోకి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఇంట్లో కుర్చీలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి అస్పష్టంగా కనపడుతున్నారు. ఈ చిత్రం టైటిల్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ‘లక్ష్మీస్’ను ఎరుపు రంగులో, ‘ఎన్టీఆర్’ ను పసుపు రంగులో డిజైన్ చేశారు. ఇదిలాఉంటే ఫస్ట్ లుక్ పోస్టర్ పై నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. సినిమాలో జరిగిన వాస్తవాలను చూపిస్తారని భావిస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA’s 10th Semiannual Chess Tournament

Read More →