Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

RGV Shocking Tweets on Pawan Kalyan..

By   /  February 8, 2016  /  Comments Off on RGV Shocking Tweets on Pawan Kalyan..

    Print       Email

RGV TWEET ON PK - 1

పవన్ ప్రసంగం కనీసం ఆయనకైనా అర్ధమైందా..?

InCorpTaxAct
Suvidha

 

రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాలకు మారుపేరులా తయారవుతున్నట్లున్నారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను ట్విట్టర్ లో ప్రస్తావించారు. అంతేకాదు.. పవన్ తీరును తప్పబట్టారు. గత ఆదివారం తుని ఘటన, కాపులను బీసీల్లో చేర్చే అంశంపై పవన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అయితే ఆ ప్రెస్ మీట్ ను తాను ఇప్పుడే విన్నట్లు వర్మ పేర్కొన్నారు. దీనిపై ఆదివారం రాత్రి ట్వీట్లు చేశారు.

 

ప్రెస్ మీట్ లో మాట్లాడిన పవన్ మాటలు కనీసం ఆయనకైనా అర్ధమయ్యాయా..? అని వర్మ ప్రశ్నించారు. మీడియా సమావేశానికి ముందు ఎవరో చెప్పిన మాటలను పవన్ నమ్మేసి.. మాట్లాడినట్లుగా ఉందని వర్మ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తాను చేసిన ప్రసంగాన్ని ఓ సారి చూసు కోవాలని కోరారు. ఇది ఏపీ పౌరుడిగా.. ఆయన అభిమానిగా తాను కోరుతున్నానని అన్నారు. అలాగే జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా పవన్ చేసి ప్రసంగాన్ని కూడా ఓ సారి చూడాలని సూచించారు. పీకే అభిమానిగా తాను వ్యక్తపరిచిన నిజాలను వ్యతిరేకించే ఏ పవన్‌ కల్యాణ్‌ అభిమాని అయినా తన దృష్టిలో నమ్మక ద్రోహిగా మిగిలిపోతాడని వర్మ పేర్కొన్నారు. అంతేకాదు.. వర్మ చేసిన ట్వీట్లలో.. చిరంజీవి కంటే.. పవన్ కల్యాణే ఎక్కువ విఫలం అయినట్లుగా పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →