Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

RGV’s Tweet About Olympic medals..

By   /  August 22, 2016  /  Comments Off on RGV’s Tweet About Olympic medals..

    Print       Email

ram gopal varma 1ఒక్క పతకానికే పొగిడేసుకోవాలా..? వర్మ సంచలన ట్వీట్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

రియో ఒలింపిక్స్ వేడుకలు ముగిశాయి. భారత్ కు ఓ కాంస్యం.. ఓ రజతం దక్కాయి. హైదరాబాద్ వచ్చిన తెలుగమ్మాయి సింధుకు అపూర్వ స్వాగతం పలికారు ప్రజలు. అలాగే దేశ్యవ్యాప్తంగా ఈ క్రీడాకారిణిలను పలువురు ప్రముఖులు ప్రసంశలతో ముంచెత్తారు. మొత్తంగా రియో ఒలింపిక్స్ లో భారత్ రజత పతకం సాధించిన ఆనందంలో ఉంది. అయితే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఒలింపిక్స్ లో అమెరికా సత్తా చాటిందని చెబుతున్నాడు. ఆయన అమెరికాను అభినందిస్తున్నాడు.

‘ఒక్క రజత పతకం సాధించినందుకే మేరా భారత్‌మహాన్‌ అని తెగ సంబరపడిపోతున్నారు.. 46 బంగారు, 37 రజతపతకాలు సాధించిన అమెరికా ఇంకెంత గర్వపడాలి. 32 కోట్ల జనాభా ఉన్న అమెరికా 46 స్వర్ణ పతకాలు దక్కించుకుంది. కేవలం ఐదు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా 9 గోల్డ్ మెడల్స్ సాధించింది. కానీ 120 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం ఒక్క రజతంతో సరిపెట్టుకుంది. ఇతర దేశాలు సాధించిన పతకాలన్నింటినీ ఒక్క రజతంతో పోలుస్తూ తెగ సంబరపడుతున్నారు. అలా చూస్తే మన భారత్‌ మహాన్‌ కంటే ఎన్నో రేట్లు అమెరికా మహాన్‌ అంటూ నినదించాలి. ఒక్క రజత పతకానికే ఉజ్వల భారత్‌ అని పొగిడేసుకుంటున్నాం.. ఒకవేళ ఇతర దేశాలు సాధించిన పతకాలన్నీ భారత్‌ సాధిస్తే.. మన దేశాన్ని ఇంకేమని పిలుస్తారో నాకు తెలుసుకోవాలని ఉంది..’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌ ద్వారా తనదైన శైలిలో స్పందించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →