Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rio 2016 Olympics: Michael Phelps says he will retire after Games

By   /  August 13, 2016  /  Comments Off on Rio 2016 Olympics: Michael Phelps says he will retire after Games

    Print       Email

phlepe 1అమెరికన్ స్టార్ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్ రిటైర్మెంట్..!

అమెరికన్‌ స్టార్‌ స్విమ్మర్‌ మైకెల్‌ ఫెల్ప్స్‌ స్విమ్మింగ్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. రియో ఒలింపిక్స్ తర్వాత వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. ఈ స్టార్ స్విమ్మర్ రియోలో నాలుగు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించాడు. ఓవరాల్ గా తన కెరీర్ లో 22 స్వర్ణ పతకాలు సాధించాడు. దీంతో అగ్రస్థానంలో నిలిచాడు. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ లో మొదటి స్వర్ణం కైవసం చేసుకుని తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అనంతరం పలు ప్రపంచ, ఒలింపిక్స్ రికార్డులు సొంతం చేసుకున్నాడు. అయితే 2012 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్ల పాటు స్విమ్మింగ్ కు దూరంగా ఉన్నాడు. తర్వాత మళ్లీ రియో ఒలింపిక్స్ తో బరిలో దిగి స్వర్ణాలు చేజిక్కించుకున్నాడు.

InCorpTaxAct
Suvidha

ఒలింపిక్స్ ముందు పెల్ప్స్ మాట్లాడుతూ..’నేను పూర్తి చేయాల్సిన పనులు మరికొన్ని ఉన్నాయి. రిటైరయ్యేలోపు వాటి సంగతి చూడాలి. మళ్లీ స్విమ్మింగ్ చేయడాన్ని చాలా ఆస్వాదిస్తున్నా. అందుకే ప్రేమతో బరిలో దిగుతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. అతనిపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే నాలుగు స్వర్ణాలు, ఓ రజతం సాధించాడు. 200 మీ వ్యక్తిగత మెడ్లేలో స్వర్ణం సాధించిన తర్వాత రిటైర్మెంట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు ఫెల్ప్స్ సమాధానం ఇచ్చాడు. తాను స్విమ్మింగ్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీగా ఉన్నానని చెప్పాడు. ఇక నుంచి తన కుమారుడు బూమర్, ప్రియురాలు నికోలాతో అధిక సమయం గడపాలని కోరుకుంటున్నా అంటూ చెప్పాడు.

రియోలో ఫెల్ప్స్‌ పతకాలు ..

* పురుషుల 4×200మీ ఫ్రీస్టైల్‌ రిలేలో స్వర్ణం
* పురుషుల 200మీ బటర్‌ఫ్లైలో స్వర్ణం
* పురుషుల 4×100మీ ఫ్రీస్టైల్‌ రిలేలో స్వర్ణం
* పురుషుల 200మీ వ్యక్తిగత మెడ్లీలో స్వర్ణం
* పురుషుల 100మీ బటర్‌ఫ్లైలో స్వర్ణం

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →