Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Rio medallist PV Sindhu arrives in Hyderabad to grand welcome

By   /  August 22, 2016  /  Comments Off on Rio medallist PV Sindhu arrives in Hyderabad to grand welcome

    Print       Email

PVSindhu 2జయహో సింధు ..!

 

InCorpTaxAct
Suvidha

 

 

రియో ఒలింపిక్స్ గోల్డ్ ఫైట్ లో అద్వితీయమైన పోరాట పటిమను ప్రదర్శించిన తెలుగు సంచలనం పివి సింధుకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. భారత్ కు రజత పతకం సాధించిపెట్టిన తెలుగమ్మాయి సింధును ప్రజలు, రాజకీయ నేతలు అత్యంత ఘనంగా స్వాగతించారు. దారిపొడవునా బాణసంచా కాలుస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. జయహో సింధు అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రజలకు అభివాదం చేస్తూ సింధు, కోచ్ గోపీచంద్ ముందుకు సాగారు.

అంతకు ముందు ఎయిర్ పోర్టులో సింధుకు తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వీరిలో తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. వీరు సింధుకు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. తర్వాత శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.PVSindhu 3

ఈ ర్యాలీ శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, ఆరాంఘర్‌ మీదుగా సాగింది. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌లో సింధు రాక సందర్భంగా వేలాది మంది విద్యార్థులు, కళాకారులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శించారు.జయహో సింధు అంటూ నినాదాలు చేశారు. రహదారి పొడవునా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఓపెన్‌టాప్‌ బస్సులో సింధు, గోపీచంద్‌లు దారి పొడవునా ప్రజలకు అభివాదం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →