Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Rio Olympics 2016 highlights Day 6: Srikanth wins opener, India women lose in hockey

By   /  August 12, 2016  /  Comments Off on Rio Olympics 2016 highlights Day 6: Srikanth wins opener, India women lose in hockey

    Print       Email

sindhupvరియో ఒలింపిక్స్ : బ్యాండ్మింటన్ పై భారత్ ఆశలు

 

InCorpTaxAct
Suvidha

 

రియోలో అమెరికా, చైనా, జపాన్ వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు దేశాలు పతకాల వేటలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. కాని భారత్ మాత్రం పతకాల కోసం ఆశగా చూస్తోంది. ఇప్పటికే షూటర్లు, ఆర్చరీ క్రీడాకారులు నిరాశమిగిల్చారు. హాకీ పురుషులు, మహిళల జట్లు ఇంకా తడబడుతున్నాయి. అయితే బ్యాడ్మింటన్ పై భారత్ ఆశలు పెట్టుకుంది. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్, పీవీ సింధు.. పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్ గెలుపుతో ఆశలు చిగురించేలా చేశారు.kidambi srikanth

బ్రెజిల్‌ క్రీడాకారిణి విసెంటెతో జరిగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌ 21-17, 21-17 తేడాతో గెలుపొందింది. అలాగే.. సింధు తిరుగులేని ప్రదర్శన చేసింది. హంగేరికి చెందిన లారా సరోసినిపై 21-8, 21-9 తేడాతో సింధు విజయాన్ని కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్‌ 21-11, 21-17తో మెక్సికో క్రీడాకారుడు లినో మునోజ్‌పై విజయాన్ని నమోదు చేశాడు.

మహిళల డబుల్స్ లో తొలి మ్యాచ్‌లోనే గుత్తా జ్వాల- అశ్విని జంట జపాన్‌కు చెందిన జోడి తకహషి- మిసాకి చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లో అత్రి- సుమిత్‌ రెడ్డి జంట ఇండోనేషియా క్రీడాకారుల చేతిలో ఓడిపోయారు. ప్రతి గూపులో ఓ జోడి మరో జోడితో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఇలా డబుల్స్‌లో గ్రూపునకు ఆరు జోడీలు చొప్పున మొత్తం నాలుగు గ్రూపులు ఉంటాయి. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జంటలు క్వార్టర్స్‌కు వెళ్తాయి. తొలి మ్యాచ్‌ లలో ఓడిన భారత్‌ డబుల్స్‌ క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో భారత్‌ పతక ఆశల్ని ఎంత మేరకు నెరవేరుస్తారో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →