రియో ఒలింపిక్స్ : స్వర్ణాలు దక్కించుకున్న ఫిజీ , అమెరికా..!
ఫిజీ కల నెరవేరింది. రగ్బీ సెవన్స్లో 47-7 తేడాతో బ్రిటన్ను మట్టికరిపించి స్వర్ణం దక్కించుకుంది. దీంతో ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఫిజీ జట్టు స్వర్ణం సాధించినట్లు అయింది. కెప్టెన్ ఒసా కొలిన్సావు ఆధ్వర్యంలోని ఫిజీ జట్టు.. ఆట మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో 29-0 ఆధిక్యం సాధించింది. రెండో అర్థభాగంలో ఫిజీ ఆటగాళ్లు దూకుడు కొనసాగిస్తూ వచ్చారు. ఏ దశలోను బ్రిటన్కు ఛాన్స్ ఇవ్వలేదు.
అలాగే.. ఒలింపిక్స్ లో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. మహిళల స్విమ్మింగ్ లో 100 మీటర్ల వ్యక్తిగత పోటీల్లో అమెరికా స్విమ్మర్ సిమోన్స్, కెనడా స్విమ్మర్ ఒలెక్సికాలు స్వర్ణ పతకాలు సాధించారు. ఇద్దరూ 52.70 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో న్యాయనిర్ణేతలు వీరిద్దరినీ విజేతలుగా ప్రకటించారు. ఈ టైమింగ్.. ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టడంతో ఇద్దరి పేరుతో నమోదైంది. దీంతో ఇద్దరికీ స్వర్ణాలు బహూకరించారు. ఇక మూడో స్థానంలో నిలిచిన స్వీడన్ స్విమ్మర్ సారాకు కాంస్య పతకం లభించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.