Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rio Olympics: Indian gymnast Dipa Karmakar nearly medals, inspires world

By   /  August 15, 2016  /  Comments Off on Rio Olympics: Indian gymnast Dipa Karmakar nearly medals, inspires world

    Print       Email

Aug 15, 2016; Rio de Janeiro, Brazil; Dipa Karmakar (IND) competes during the women's vault finals in the Rio 2016 Summer Olympic Games at Rio Olympic Arena. Mandatory Credit: Andrew P. Scott-USA TODAY Sports

జిమ్నాస్టిక్స్ లో దీప అత్యద్భుత ప్రదర్శన..

InCorpTaxAct
Suvidha

 

 

 

జిమ్నాస్టిక్స్‌ మహిళల వాల్ట్‌ ఫైనల్స్‌లో భారత జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ ఎటువంటి పతకం లేకుండానే వెనుదిరిగింది. పోటీల్లో భాగంగా ఆమె నాలుగో స్థానానికి పరిమితమైంది.తన మొదటి ప్రయత్నంలోనే 14 పాయింట్‌ 866 పాయింట్లు సాధించింది.అయితే.. రెండో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రదర్శన చేసి అందరిని ఆకట్టుకుంది. రెండవ ప్రదర్శనలో 15 పాయింట్‌ 266 పాయింట్లు స్కోర్‌ సాధించింది. సరాసరి 15 పాయింట్‌ 066 స్కోర్‌ సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో అమెరికాకు చెందిన సిమోన్‌ బైల్స్‌ 15 పాయింట్‌ 966 స్కోర్‌తో స్వర్ణం దక్కించుకుంది. రష్యాకు చెందిన మారియా పాసెకా 15 పాయింట్‌ 253తో రజతం.. స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన స్టెయిన్‌గ్రుబెర్‌ 15 పాయింట్‌ 216తో కాంస్యం సాధించారు. కాంస్య పతకం దక్కించుకున్న జిమ్నాస్ట్‌ సాధించిన పాయింట్లు, దీప సాధించిన పాయింట్లకు మధ్య తేడా కేవలం 0 పాయింట్‌ 15 మాత్రమే ఉండటం విశేషం.

ప్రమాదకరమైన విన్యాసాలతో ఆకట్టుకున్న దీప..

దీపా కర్మాకర్‌ రియో ఒలింపిక్స్‌ లో చేసిన ప్రదర్శన అందరూ మెచ్చుకోదగిన విధంగా ఉందని చెప్పొచ్చు. తనను తక్కువ అంచనా వేసిన వాళ్లందరికి తన ప్రదర్శన ద్వారా సమాధానం చెప్పింది. కొన్ని నెలల క్రితం భారత్ జిమ్మాస్ట్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది అనే వార్త వచ్చింది. ఆ సందర్భంలో ఏదో ఒలింపిక్స్ కు వెళ్ళిరావడం వరకే అని పలువురు భావించారు. అయితే పేలవ ప్రదర్శన చేస్తుందని ఊహించిన వారందరికి దీప కర్మాకర్ తన ప్రదర్శన ద్వారా సమాధానం చెప్పింది.

నాలుగు రోజుల కిందట అందరిని షాక్ కి గురిచేస్తూ వాల్డ్ విభాగంలో ఫైనల్ కు చేరింది. తుదిపోరులో కూడా అందరి అంచనాలను మించి అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచస్థాయి జిమ్మాస్ట్ లతో పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచింది. ఎవరూ సాహసించని ప్రమాదకరమైన విన్యాసమైన ప్రొడునోవాను ఫైనల్ సందర్భంగా అత్యద్భుతంగా ప్రదర్శించింది. అయితే దీప.. 15 పాయింట్‌ 066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. జిమ్నాస్టిక్స్‌లో చైనా ఆధిపత్యం గురించి అందరికి తెలిసిన విషయమే. అలాంటి చైనాకు చెందిన యాన్ వాంగ్ దీప తర్వాతి స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ సహా పలు చోట్ల స్వర్ణాలు సాధించిన ఉజ్బెకిస్థాన్‌ దిగ్గజ జిమ్నాస్ట్‌ చుసోవితినా కూడా దీప కంటే కింద ఏడో స్థానంలో నిలిచింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →