కవర్ పేజీపై రెచ్చిపోయి కనిపించిన రితికా సింగ్..?
ఒకే చిత్రంతో ఏకంగా మూడు భాషల్లో కనిపించనుంది ముద్దుగుమ్మ రితికా సింగ్. ఒరిజినల్ గా ఈ భామ మంచి బాక్సర్ అన్న విషయం తెలిసిందే, నేషనల్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్ అన్న విషయం కూడా తెలిసిందే. అయితే సినిమాల్లో రాణించేందుకు ఈ అందాల భామ గ్లామర్ ను నమ్ముకుంటోందట. మరిన్ని ఆఫర్ల కోసం గ్లామర్ ను ఎరగావేస్తోందని ప్రచారం సాగుతోంది. రితికా త్వరలో గురు చిత్రంతో కనిపించనుంది.
తమిళ్ లో ఇప్పటికే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇక నుంచి అవకాశాలు వెతుక్కుంటూ రావడం కోసం ఓ మ్యాగ్ జీన్ కవర్ పేజీపై అందాలు ఆరబోసిందట. స్కిన్ షో చేస్తే అవకాశాలు వస్తాయని భావించిందేమోనని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే అందాల ఆరబోతలో రాజీ పడలేదని గుసగుసలాడుకుంటున్నాయి.మరి ఈ ముద్దుగుమ్మ ప్లాన్ వర్కవుట్ అవుతుందా అన్నది వేచి చూడాల్సిందేనని అనుకుంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.