గుర్ మెహర్ కౌర్, సెహ్వాగ్ కు సూచనలు చేసిన రేడియో మిర్చీ ఆర్జే నవేద్..
రేడియో మిర్చి ఆర్జే నవేద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధిని గుర్ మెహర్ కౌర్ కు మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ కు ఓ విషయం చెప్పదలచుకున్నా అంటూ సోషల్ మీడియాలో చెప్పారు. కార్గిల్ అమరవీరుడు అయిన సైనికుడి కుమార్తె గుర్ మెహర్ కైర్ రామ్ జాన్ కాలేజీ అల్లర్ల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అదికాస్తా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘పాకిస్థాన్ నా తండ్రిని హతమార్చలేదు. యుద్ధమే నా తండ్రిని హతమార్చింది’ అంటూ ఆమె పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.
దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు.’నేను ట్రిపుల్ సెంచరీలు చేయలేదు.. నా బ్యాట్ చేసింది’ అంటూ ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. దీంతో ఈ అంశంలో నెటిజన్లు తప్పొప్పులు ఎంచడం మొదలుపెట్టారు. ఇక ఈ అంశంపై రేడియో మిర్జీ ఆర్జే నవేద్ స్పందించాడు. తన అభిప్రాయాన్ని ప్లకార్డు ద్వారా తెలియజేస్తూ ఓ వీడియోను అప్ లోడ్ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్ అయింది. ఇంచుమించు మూడులక్షల మంది వీక్షించారు.
‘ప్రియమైన గుర్ మెహర్ కౌర్, వీరేంద్ర సెహ్వాగ్ మీ ఇద్దరికి నేను ఓ విషయం చెప్పదలచుకున్నాను. మీకే కాదు దేశంలోని జాతీయ వాదులకు వ్యతిరేక జాతీయవాదులకు పాకిస్థాన్ వెళ్లాలని అనుకుంటున్నవారికి ఓ విషయం చెప్పదలచుకున్నాను. కాగితాన్ని వృధా చేయడం ఆపండి’ అంటూ నవేద్ వీడియోలో ప్లకార్డులు చూపిస్తూ చెప్పాడు. ఆ తర్వాత హిందీలో మాట్లాడారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.