Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Robotic surgery coming soon in Basavatarakam Hospital..

By   /  April 9, 2017  /  Comments Off on Robotic surgery coming soon in Basavatarakam Hospital..

    Print       Email

bala-krishna-press-meetబసవతారకంలో క్యాన్సర్ ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీ: బాలకృష్ణ

 

InCorpTaxAct
Suvidha

 

 

 

హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో రాబోయే 3 నెలల్లో రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకు వస్తామని ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ తెలిపారు. తన తల్లి కోరిక మేరకు తన తండ్రి ఎన్టీఆర్ ఈ ఆస్పత్రిని నిర్మించారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆస్పత్రిని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆస్పత్రిని నిర్వహిస్తున్న ఈ ట్రస్టు అన్ని సేవలు అందిస్తోందని అన్నారు. ‘నో ప్రాఫిట్ .. నో లాస్’తో నడుస్తోందని అన్నారు.

ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన భవనాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, స్థానిక నేతలు పాల్గొన్నారు. పేదలకు కోసం పనిచేస్తున్న వ్యక్తి బాలయ్య అని అన్నారు. నిరుపేద‌ల కోసం బాల‌కృష్ణ నిత్యం ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. ఈ ఆస్పత్రిలో పేద‌ల‌కు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని అన్నారు. పేదల కోసం ప‌నిచేస్తోన్న ఒకే ఒక సంస్థ ఉందని అన్నారు. అది బ‌స‌వ‌తార‌క‌ం అని చంద్రబాబు ప్రశంసించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →