Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Roja

By   /  April 17, 2016  /  Comments Off on Roja

    Print       Email

4396_YCP MLA Rojaటీడీపీలో మ‌గాళ్లే లేరా?

 

InCorpTaxAct
Suvidha

 

తెలుగుదేశం పార్టీలో ఒక్క‌రు కూడా మ‌గాళ్లు లేరు కాబ‌ట్టే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల‌ను కొంటున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమ‌ర్శించింది. చంద్ర‌బాబు నాయుడు తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ ద‌ద్ద‌మ్మ‌ల‌ని ఎద్దేవా చేసింది. చంద్ర‌బాబు నాయుడుకు దోచుకోవ‌డం దాచుకోవ‌డంలో ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌జ‌ల సంక్షేమంపై లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. విశాఖ‌కు రైల్వే జోన్ కావాల‌ని కోరుతూ నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ‌ అమర్నాథ్కు ఆదివారం రోజా సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా రోజా మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడ‌కు ద‌మ్మూ ధైర్యం ఉంటే ఫిర్యాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు.
6 ద‌శాబ్దాల స‌మ‌స్య‌ను 6 నెల‌ల్లో ప‌రిష్క‌రిస్తామ‌ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన తెలుగుదేశం ప్ర‌భుత్వం రెండేళ్లు అవుతున్నా అతీగ‌తీ లేద‌న్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు ద‌ద్ద‌మ్మ‌లు కాబ‌ట్టే విశాఖ‌కు రైల్వే జోన్ తీసుకు రాలేక‌పోతున్నార‌న్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తే త‌న కేసులు ఎక్క‌డ బ‌య‌ట ప‌డ‌తాయోన‌ని భ‌య‌ప‌డుతున్నార‌న్నారు. చంద్ర‌బాబు సీఎం కావ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్టిన శాపం అన్నారు. విశాఖ‌లో మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు పోటీపడి దోచుకుంటున్నారని విమ‌ర్శించారు. అడ్డ‌దిడ్డంగా మాట్లాడే అచ్చ‌న్నాయుడు ఏరోజైనా రైల్వే జోన్ గురించి మాట్లాడాల‌ని ప్ర‌శ్నించారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఒక్క ప‌రిశ్ర‌మకానీ, ఒక్క ఉద్యోగం కానీ ఇవ్వ‌లేద‌ని, ఆఖ‌రుకు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న రైల్వే జోన్‌ను తీసుకురావ‌డంలో కూడా తెలుగుదేశం ప్ర‌భుత్వం మీనామేషాలు లెక్కేస్తోంద‌న్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →