Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Rosamma is no more….

By   /  August 8, 2016  /  Comments Off on Rosamma is no more….

    Print       Email

Roshammaరోశ‌మ్మ ఇక లేరు

 

InCorpTaxAct
Suvidha

 

 

సారాకు వ్య‌తిరేకంగా పోరాడిన దూబ‌గుంట రోశ‌మ్మ (93) ఆదివారం త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. మ‌ద్య‌పాన నిషేదం కోసం పోరాటం చేసిన రోశ‌మ్మ ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచారు. 1990లో నెల్లూరు జిల్లా కలిగిరి మండల పరిధిలోని తూర్పు దూబగుంట గ్రామం నుంచి మద్య నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టిన రోశ‌మ్మకు వాడ‌వాడ‌లా జ‌నం నిరాజ‌నం ప‌ట్టారు. రోశమ్మ ఉద్యమం గురించి తెలుసుకున్న అప్పటి విపక్ష టీడీపీ నేత ఎన్టీఆర్ కూడా ఆమెకు మద్దతు పలికారు. రోశమ్మ చేస్తున్న ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునివ్వడంతోపాటు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. మద్య నిషేధం అమలు చేస్తామని అప్పట్లోనే ఆయన ప్రకటించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధాన్ని అమలు చేసి ఎన్టీఆర్ మాట నిల‌బెట్టుకున్నారు. రోశ‌మ్మ‌ ఏమాత్రమూ చదువుకోకపోయినా.. సమాజంపై ఉన్న వివేచనతో ఉద్యమానికి నాంది పలికి.. సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసిన ఆమెకు ప్రతి ప్రాంతంలోనూ మద్దతు లభించింది.

అనేక మంది మహిళలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థలు పోటీ పడి మరీ రోశమ్మ వెనకాల నడిచాయంటే.. ఆ నారీ శిరోమణి.. పట్టుదల – లక్ష్య సాధన ఇట్టే అర్థమవుతుంది. ఇలా రోశమ్మకు లభించిన గుర్తింపు ఆమె ఇంటిపేరును దూబగుంటగా మార్చేసింది. కిడ్నీలు పాడైపోయిన దశలో డయాలసిస్ చేయించుకునే శక్తి లేక వైద్యానికి ఆమె దూరం కావడం అందరినీ కలచివేస్తున్న అంశం. కాగారెండు రోజులుగా రోశమ్మ ఎలాంటి ఆహారమూ తీసుకోలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఏదేమైనా ఏమి చ‌దువుకోని ఒక మ‌హిళ రాష్ట్రాన్ని మొత్తం ప్ర‌భావితం చేయ‌డం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →