Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Rourkela: Four suspected SIMI terrorists arrested in a joint operation

By   /  February 17, 2016  /  Comments Off on Rourkela: Four suspected SIMI terrorists arrested in a joint operation

    Print       Email

simi-terrorist Cపోలీసులకు చిక్కిన నలుగురు సిమీ ఉగ్రవాదులు..

ఖాండ్వా జైలు నుంచి పరారైన సిమి ఉగ్రవాదులు చివరకు పోలీసులకు చిక్కారు. ఒడిశాలోని రావూర్ ఖిల్లా ఏరియాలో ఉగ్రవాదులు బస చేసిన ఇంటిపై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారం అందుకున్న నల్గొండ పోలీసులు.. ఒడిశా పోలీసుల సాయంతో ఈ దాడులు నిర్వహించారు. అయితే మూడు గంటల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. చివరకు నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 తుపాకులు, బుల్లెట్లు సహా పలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు 2013లో మధ్యప్రదేశ్‌ లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న సిమి ఉగ్రవాదులుగా గుర్తించారు. ఖాండ్వా జైలు నుంచి 6 గురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నల్గొండ జిల్లాలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు ఎజాద్‌, అస్లామ్‌ హతమయ్యారు. మిగిలిన అబూ ఫైజల్‌, మహబూబ్‌, అంజాద్‌, జకీర్‌ పోలీసులకు చిక్కారు. నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఒడిశా డీజీపీ కేబీసింగ్‌ ప్రకటించారు.
తెలంగాణ పోలీసులను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు..SIMI TERRARISTS - A

InCorpTaxAct
Suvidha

ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ పోలీసులను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందించారు. డీజీపీ అనురాగ్‌శర్మకు ఆయన స్వయంగా ఫోన్‌ చేసి ప్రశంసించారు. ఒడిశాలో నలుగురు సిమి ఉగ్రవాదుల అరెస్టులో తెలంగాణ రాష్ట్ర నిఘా వర్గాలు కీలకంగా పనిచేశాయి. దేశవ్యాప్తంగా ఐఎస్‌ఐఎస్‌ నెట్‌వర్క్‌ను ఛేదించడంలో తెలంగాణ పోలీసులు కీలక పనితీరును ప్రదర్శించారని హోంమంత్రి అభినందించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తెలంగాణ పోలీసులు ఇదేవిధంగా పనిచేయాలని ఆయన కోరారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →