ఐపీఎల్ విజేత ఎవరు?
ఇండియాన్ ప్రీమియర్ లీగ్ చివరి ఘట్టానికి చేరుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఈ రాత్రికి 8.00 లకు హైదరాబాద్ సన్‌రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. ఒక జట్టు బ్యాటింగే బలంగా బరిలోకి దిగనుండగా… మరొకరు బౌలింగ్‌తో ప్రత్య ర్థులకు చుక్కలు చూపెట్టేం దుకు ఉవ్విళ్లూరుతోంది. ఇందులో ఎవరు గెలిచానా ఐపీఎల్ కొత్త చాంపియన్‌గా చరిత్ర సృష్టిస్తారు. గడిచిన ఎనిమిది ఐపీఎల్ సీజన్లలో రెండుసార్లు (2009, 2011) ఫైనల్‌కు చేరిన బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్‌ను దక్కించుకోలేకపోయింది. దీంతో తొలిసారి టైటిల్‌ను గెలవాలని కోహ్లి సేన కసితో ఉంది. మరో వైపు 2013లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ అదే సంవ త్సరం ప్లే ఆఫ్‌కు చేరడం మినహా ఆ తరువాత పెద్దగా ఆకట్టుకున్న ధాఖలా లు లేవు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతూ ట్రోఫీని కైవసం చేసుకునే పనిలో పడ్డాయి.
సొంత గడ్డపై మరోసారి కోహ్లి సేన చెలరేగిపోయే అవకాశం ఉండటంతో వార్నర్ సేన అందుకు తగిన వ్యూహ రచనతో సిద్ధం అవుతోంది. కాగా ఈ సీజన్లో బెంగళూరు నమోదు చేసిన పరుగుల్లో 35 శాతం విరాట్ కోహ్లి నే సాధించాడు. అటు విరాట్ కోహ్లితో పాటు, గేల్, ఏబీ డివిలియర్స్, ఆపై షేన్ వాట్సన్ ఇలా స్టార్ ఆట గాళ్లంతా బెంగళూరుకు బ్యాటింగ్ బలం. వీరిని నిలువరించడం సన్‌రైజర్స్‌కు కాస్త కష్టమే. ఓ రకంగా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన జట్టు ఒకటైతే, ఆది లో వరుస వైఫల్యాలతో లీగ్ దశ నుంచే న్రిష్కమించే పరిస్థితి నుంచి తేరుకొని ఫైనల్ చేరిన జట్టు మరొక టి. అనూహ్య పరిణామాల మధ్య ముంబై నుంచి బెంగళూరుకు మారిన వేదికపై తలపడేందుకు ఈ రెండుజట్లు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ లీగ్ ఫైనల్ పోరులో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకో నున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.