Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rumors on Trivikram economic position..?

By   /  August 14, 2016  /  Comments Off on Rumors on Trivikram economic position..?

    Print       Email

trivikram srinivas 2త్రివిక్రమ్ విషయంలో పుకార్లు షికార్లు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

సినీ ప్రముఖులు ఎప్పడు ఏం చేస్తున్నారు..? వారి ఇళ్ళలో ఏమేం జరుగుతున్నాయి..? అని తెలుసుకోవడం వారి అభిమానులకు షరామామూలే. ఈ నేపథ్యంలో ప్రముఖులు చేసే కొన్ని పనుల విషయంలో పుకార్లు షికార్లు చేస్తూంటాయి. ఈ విషయం రీసెంట్ గా పవన్ కల్యాణ్ విషయంలో రుజువైంది. పవన్ కారు అమ్మేసుకున్నాడని.. అప్పుల్లో కూరుకుపోయాడని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. పవర్ స్టార్ కు డబ్బుల కొదవేంటో చాలామందికి అర్ధంకాలేదు. ఉన్నట్లుండి పవన్ కారు అమ్మేయడంపై సినీ జనాలు కూడా గుసగుసలాడుకున్నారు. అయితే పాతకారు అమ్మేసి కొత్తకారు కొనుక్కుంటున్నాడనే విషయం తెలియడంతో ఈ పుకార్లకు బ్రేక్ పడింది.

మళ్ళీ ఇలాంటి పుకార్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విషయంలో షికార్లు చేశాయి. ఈయన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని.. అందుకే హైదరాబాద్ లోని ఇంటి నిర్మాణం సగంలో ఆగిపోయిందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ పుకార్లలో నిజం లేదని తెలుస్తోంది. త్రివిక్రమ్ తన ఇంటి వాస్తును సరిచూసుకోవడం కోసమే నిర్మాణాన్ని నిలిపివేశారని తెలుస్తోంది.

హైదరాబాద్ లోని ఓ ఏరియాలో అధునాతన భవంతిని నిర్మిస్తున్నాడు త్రివిక్రమ్. ఈ ఇంటికి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ పనిచేస్తున్నాడు. అయితే నిర్మాణ సమయంలోనే వాస్తు దోషం బయటపడిందట. దీంతో వాస్తు పండిట్స్ ని పిలిచి సరిచేయించే పనిలో పడ్డారట. అందుకే తాత్కాలికంగా నిర్మాణాన్ని ఆపివేశారట. ఈ విషయం తెలియక కొంతమంది త్రివిక్రమ్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని.. డబ్బులేక ఇంటిపని సగంలో ఆపేశాడని ప్రచారం మొదలుపెట్టారు. అయితే తన ఇంటి నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి పవన్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళే యోచనలో ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →