Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

మాస్ట‌ర్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ

By   /  April 25, 2016  /  Comments Off on మాస్ట‌ర్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ

    Print       Email

sachin-tendulkar1స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్ కు దూర‌మై దాదాపు మూడు సంవ‌త్స‌రాలు కావ‌స్తున్నా నేటికీ ఆయ‌నకు క్రేజ్ త‌గ్గ‌డం లేదు. ఏప్రిల్ 24న పుస్టిన రోజు జ‌రుపుకున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌పై  ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు. స‌చిన్‌పై త‌మ్మ‌కున్న అభిమానం ఎప్ప‌టికీ త‌ర‌గిపోద‌ని నిరూపించారు.క్రికెట్ సహచరులు, అభిమానులు, ప్రపంచ సెలబ్రిటీలు, బాలీవుడ్ నటులు, వ్యాపార దిగ్గజాలు తదితరుల విషెస్ తో ట్విట్టర్ పులకించి పోయింది. క్రికెట్ రారాజు అని.. క్రికెట్ దేవుడ‌ని, క్రికెట్ లెజెండ్ అని ఇలా ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌ల‌లో ల‌క్ష‌ల సంఖ్య‌లో కామెంట్స్ పోస్టు చేశారు.

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు సచిన్.. నీవు మా అందరిని గర్వపడేలా చేశావు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ‘క్రికెట్ దేవుడు సచిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. దేశానికి అసలైన హీరో.. రియల్ జెమ్ నువ్వే’ అంటూ యువరాజ్ ట్వీట్ చేశాడు. వీరితోపాటు సురేశ్ రైనా, శిఖర్ ధవన్, అనిల్ కుంబ్లే, అనురాగ్ ఠాకూర్, మహ్మద్ కైఫ్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రతుల్ పటేల్ తదితరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో ఉన్నారు. శుభాకాంక్షలు తెలిపిన అంద‌రికీ కూడా స‌చిన్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →