Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Sachin- Tollywood Stars in Foot Ball club

By   /  June 2, 2016  /  Comments Off on Sachin- Tollywood Stars in Foot Ball club

    Print       Email

1464778754-1306`బ్లాస్ట‌ర్స్‌`తో స్టార్స్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఇటీవ‌ల కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ (కేబీఎఫ్‌సీ)ను స్థాపించిన విష‌యం తెలిసిందే. అయితే ఇందులో మ‌న స్టార్స్ కూడా చేరిపోయారు. అంతేకాదు అందులో భాగ‌స్వాములు కూడా. ఈ నేప‌థ్యంలో మొన్న తిరుమ‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. తాను స్థాపించిన కేబీఎఫ్‌సీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున భాగ‌స్వాములుగా ఉంటార‌ని, పెట్టుబ‌డి దారుల క‌న్సార్టీయంలో నిర్మాత అల్లు అర‌వింద్‌, పారిశ్రామిక‌వేత్త నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌లు కొన‌సాగుతార‌న్నారు.

అయితే చిరంజీవి మాట్లాడుతూ ఇదో కొత్తరకం అనుభ‌వ‌మ‌న్నారు. రెండు సినిమాల్లో తాను గోల్‌ కీపర్‌, కోచ్‌ల పాత్ర‌లు పోషించిన‌ట్లు గుర్తు చేశారు. విద్యలో క్రీడల పాత్ర కూడా ఉండాలని నాగార్జున ఉద్ఘాటించారు. దురదృష్టవశాత్తూ క్రీడల్లో దేశం వెనుకబడిందన్నారు. కాగా.. కేరళలో మద్యపానం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్వహించే ప్రచారంలో స‌చిన్ పేరు ఉప‌యోగించుకునేందుకు మాస్ట‌ర్ ఓకే చెప్పారు. ఈ సంద‌ర్భంగా  సచిన్ తో చిరు, నాగ్, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లుఅరవింద్ ఓ సెల్ఫీని దిగారు.అంతా పసుపు రంగులో ఉన్న దుస్తులు ధరించి సెల్ఫీ తీసుకున్నారు. ఈ అరుదైన సెల్ఫీని నాగార్జున ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →