Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Sadha Nandha Gowda on High Court Split between Telangana & AP

By   /  May 26, 2016  /  Comments Off on Sadha Nandha Gowda on High Court Split between Telangana & AP

    Print       Email

sada nandha gowdaహైకోర్టు బాధ్య‌త బాబుదే

 

InCorpTaxAct
Suvidha

 

 

రాష్ట్ర హైకోర్టు విభ‌జ‌న గొడ‌వ ఎప్ప‌టి నుంచో న‌డుస్తోంది. దీంతో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కాగా దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి స‌దానంద గౌడ స్పందించారు. హైదరాబాద్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటున్నా….. అందుకు నిబంధనలు అంగీకరించవని తెలిపారు. ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఏర్పాటు కావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని… కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికల సంస్కరణపై న్యాయ కమిషన్‌ రెండు నివేదికలు ఇచ్చిందని,  పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని కూడా కమిషన్‌ సూచించిందని వెల్లడించారు. వాటిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఓ కమిటీని నియమించామని ఆయన వివరించారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు కావాల‌ని,  దీనిపై  ఏపీ  సీఎం ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలిఅని కూడా సూచించారు. కాగా హైకోర్టు విభ‌జ‌న‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ స్పందించ‌లేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి హైకోర్టును ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించ‌డంతో బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏది ఏమైనా ఈ రాష్ట్ర హైకోర్టు విభ‌జ‌న గొడ‌వ ఎంత త్వ‌ర‌గా పూర్తి అయితే అంత మంచిది. ఇరు రాష్ట్రాల గొడ‌వ‌ల వ‌ల‌న ఎన్నో ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా ఆల‌స్యం అయితే మ‌రిన్ని పెండింగ్‌లో ప‌డే అవ‌కాశం ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →