Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sai Kumar Praises Chiranjeevi over Police Story Success

By   /  August 17, 2016  /  Comments Off on Sai Kumar Praises Chiranjeevi over Police Story Success

    Print       Email

sai kumar‘అగ్ని’ సక్సెస్ వెనుక చిరు..!

 

InCorpTaxAct
Suvidha

 

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సాయి కుమార్ ఎంతో ఫేమస్.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పలువురు ప్రముఖ హీరోలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఆయన వాయిస్ ని బట్టి కూడా కొన్ని సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయి. అయితే ఈ డైలాంగ్ కింగ్ కొన్ని పాత్రల్లో కూడా నటించారు. కాని ఆయనకు బాగా గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం ‘పోలీస్ స్టోరీ’
. ఇందులో ‘అగ్ని’ గా ఆయన ప్రేక్షకులను మెప్పించారు. తర్వాత ఈ పాత్రను చాలామంది స్కిడ్స్ రూపంలో కూడా వినియోగించుకున్నారు. అంతలా సాయి కుమార్ చేసిన పాత్ర హైలెట్ అయింది.

ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయన చిత్రానికి సంబంధించి కొన్ని విశేషాలను వెల్లడించారు. ముఖ్యంగా ఆయన తెలుగు వెర్షన్ హిట్ కావడం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని అన్నారు. సినిమా విడుదల టైమ్ లో తాను చెన్నై వెళ్ళిపోయానని తెలిపారు. తన మిత్రులు ఫోన్ చేసి సినిమా హిట్ అయిందని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ‘పోలీస్ స్టోరీ’ తెలుగు వెర్షన్ గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. కాని చిరంజీవి.. ఆ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. చిరు.. సినిమా బాగుందని చెప్పిన తర్వాత ప్రేక్షకుల్లో ఆశక్తి పెరిగిందన్నారు. తమ సినిమా దాదాపుగా 200 రోజులు ఆడి సూపర్ హిట్ అయిందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →