కమెడియన్ సరసన నటించనున్న సలోని..!
తన అందచందాలతో టాలీవుడ్ యాక్ట్రెస్ సలోని యువతకు పిచ్చెక్కించింది . ఇటీవల ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. దీంతో అందాల ఆరోబోతను నమ్ముకుంది. అయినా బడా హీరోల సరసన అవకాశాలు రాలేదు. ‘మర్యాద రామన్న’తో రాజమౌళి మంచి హిట్ అందించినా.. అవకాశాలు మాత్రం నిల్.
దీంతో సలోని తీవ్ర నిరాశకు లోనైంది. ఓ కమెడియన్ కు జంటగా నటించేందుకు ఒప్పేసుకుంది. కమెడియన్ అంటే ఆలీ, వేణుమాధవ్ వంటి వారు కాదు. ఇటీవలి కాలంలో టైమింగ్ పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పృథ్వీ. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఓ మూవీలో .. పృథ్వీ సరసన నటించేందుకు సలోని ఒకే చెప్పేసింది.
ఎదురుచూసినా అవకాశాలు రాకపోవడంతో.. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేకనే సలోని ఈ ఆఫర్ కు అంగీకరించిందని టాలీవుడ్ టాక్. అయితే ఇక్కడ సలోని గురించి వదిలేసి.. పృథ్వీని చూసి చాలామంది ఈర్ష్యపడుతున్నారట. యంగ్ హీరోయిన్ తో ఈ కమెడియన్ కి సరసాలాడే అవకాశం చిక్కిందని గుసగుసలాడుకుంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.