నాగార్జున సినిమాలో సమంత..!
కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ లో ఇప్పుడు సమంత కూడా జాయిన్ అవుతుందట. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన కన్నడ భామ శ్రద్ధ శ్రీనాధ్ నటిస్తుండగా.. నాని సరసన మాత్రం సమంత కన్ఫాం అయ్యిందట. అక్కినేని ఇంటి కోడలిగా మారాక సమంత సెలెక్టెడ్ సినిమాలను చేస్తుంది.
రాజు గారి గది-2 తర్వాత సమంత తెలుగులో రంగస్థలం చేస్తుండగా ఆ తర్వాత ఈ సినిమానే అవడం విశేషం. ఇక ఇదే కాకుండా కన్నడ సూపర్ హిట్ మూవీ యూటర్న్ సినిమా రీమేక్ లో కూడా సమంత నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమాను సమంత నిర్మిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక నాగ్ తో సమంత ఇదవరకు మనం సినిమాలో నటించగా.. రాజు గారి గది-2లో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.