Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Samantha

By   /  May 23, 2016  /  Comments Off on Samantha

    Print       Email

Samanthaపెళ్లికి రెడీ అంటున్న స‌మంత‌

 

InCorpTaxAct
Suvidha

 

 

చెన్నై సుంద‌రి స‌మంత త్వ‌ర‌లో పెళ్లికి రెడీ కాబోతున్న‌ట్లు ఆమె స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అందుకే సినిమాల‌కు కొంత గ్యాప్ ఇస్తున్న‌ట్లు కూడా చెప్పారు. పెళ్లికి ముందు వంటా వార్పులు నేర్చుకోవాలి క‌దా అంటూ చెప్పుకొచ్చింది. ఓ మీడియా ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇంకా ఏమ‌న్నారంటే.. ‘‘పెళ్ళి స్టేజ్ వచ్చేసింది.. ఇప్పుడింక పెళ్ళి, పిల్లలతో సెటిల్ అవ్వాలనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది స‌మంత‌.  కొన్నేళ్ళుగా ఓ యువ హీరోతో ప్రేమాయణం నడుపుతున్న సమంత అతడెవరో తెలుసుకునేందుకు ఇంకొన్ని నెలలు ఓపిక పట్టాలని సమాధానమిస్తోంది. వీరి ప్రేమకు ఇరువర్గాల కుటుంబీకులు మద్దతు తెలిపారట. ఇక ‘గట్టిమేళం’ వాయించడమే ఆలస్యం. ఆ రీల్ కమ్ రియల్ హీరో పేరు బయటపెట్టని స‌మంత అతడి గురించి కొన్ని వివరాలు ఇలా చెప్పుకొచ్చింది. ‘‘చాలా సంవత్సరాలుగా అతడు పరిచయం. అతడు గరిట పట్టాడంటే నలభీమపాకమే. నాన్‌వెజ్ అయితే అదుర్స్ అంతే.

నాకేమో తినడం మాత్రమే వచ్చు. అతడు వండిపెడితే తినడానికి చాలా సిగ్గుగా ఉంటుంది. అందుకే సినిమాల నుండి బ్రేక్ తీసుకుని వంటల్లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నా. ఎమోషన్ ఏదైనా నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతాను. తను నాకు పూర్తి వ్యతిరేకం. ఆలోచించి మాట్లాడతాడు, పేషెన్స్‌తో ఉంటాడు. హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే. అదే లేకపోతే అతడిని లవ్ చేసేదాన్ని కాదేమో’’ అంటూ ఓ మామూలు అమ్మాయిలా మురిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →